హైదరాబాద్, అక్టోబర్ 26: టెలికం దిగ్గజం జియో..దివాళి ధమాకా ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసిన చౌకైన 4జీ ఫీచర్ ఫోన్‌ను రూ.699కి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. 4జీ నెట్వర్క్ పరిధిలోకి మరింత మంది యూజర్లను తీసుకురావాలనే ఉద్దేశంతో ఇటీవల విడుదల చేసిన ఫీచర్ ఫోన్లను దీపావళి పండుగను దృష్టిలో పెట్టుకొని భారీగా తగ్గించినట్లు పేర్కొంది. స్వల్ప కాలం మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉండనున్నదని పేర్కొంది. ఈ ఫోన్‌తోపాటు నెలవారి ప్లాన్‌ను ఉచితంగా అందిస్తున్నది. ఈ ఆఫర్ కింద అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్‌తోపాటు 14జీబీ డాటా, 455 లైవ్ టీవీ చానెళ్లను తిలకించవచ్చును.