Akshaya Tritiya | అక్షయ తృతీయ.. పవిత్రమైన రోజు.. మహిళలు ఈ రోజు పిసరంత.. కనీసం ఒక గ్రామ్ బంగారమైనా కొనాలని భావిస్తుంటారు. ఈ రోజు బంగారం కొంటే కుటుంబానికి మంచి జరుగుతుందని ప్రతీతి. పురాణాల్లోనూ అక్షయ తృతీయ ( Akshaya Tritiya ) కు ప్రాధాన్యం ఉంది కూడా.. కుబేరుడు తనకు సంపదలు ప్రసాదించాలని పరమేశ్వరుడ్ని ప్రార్థించాడట. అక్షయ తృతీయ ( Akshaya Tritiya ) నాడు కుబేరుడికి లక్ష్మీ అనుగ్రహం కలిగిస్తూ శివుడు అనుగ్రహించినట్లు శివపురాణం చెబుతున్నది. శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని ఐశ్వర్యానికి ప్రతిరూపంగా హిందువులు పూజిస్తుంటారు. శ్రీమహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహం ఉంటే తమ జీవితంలో ఏ లోటు ఉండదని హిందువులు భావిస్తారు.
కనుక లక్ష్మీదేవి కటాక్షం పొందడానికి ప్రతి ఒక్కరూ అక్షయ తృతీయ నాడు బంగారం కొనాలని పెద్దలు సూచిస్తుంటారు. సంపదకు బంగారం సంకేతం. సంపద ఉన్న వారికి ఇబ్బందులు తలెత్తవు. కనుక అక్షయ తృతీయ ( Akshaya Tritiya ) నాడు బంగారం కొన్న వారికి ఏడాది పొడవునా సంపద ఉంటుందని నమ్ముతుంటారు. మంగళవారం (మే 3) అక్షయ తృతీయ ( Akshaya Tritiya ). ఈ నేపథ్యంలో పలు కంపెనీలు బంగారం కొనుగోలు చేసే వారి కోసం పలు రకాల ఆఫర్లు ప్రకటించాయి. అవేంటో ఓ లుక్కేద్దామా..!
ఆన్లైన్లో రూ.25 వేల విలువైన బంగారం ఆభరణాలు కొనుగోలు చేసే వారికి మలబార్ గోల్డ్ ఒక బంగారం నాణెం ఉచితంగా అందిస్తున్నది. రూ.25 వేల విలువైన డైమండ్, ఇతర విలువైన ఆభరణాలు కొంటే రెండు నాణాలు ఇస్తున్నది. క్రెడిట్ కార్డుపై కొనుగోలు చేసేవారికి ఐదు శాతం క్యాష్ బ్యాక్ అదనం.
బంగారం, వజ్రాభరణాల తయారీ చార్జీలపై తనిష్క్ 20 శాతం రాయితీ ఇస్తున్నది. సాదా ఆభరణాలపై ఒక్కో గ్రామ్కు రూ.200 చొప్పున రాయితీ కల్పిస్తున్నది. బుధవారం వరకు ఈ ఆఫర్ పొందొచ్చు. ఇక
రూ.50 వేల దాటిన వజ్రాభరణం కొనుగోలు చేస్తే జోయల్లుకాస్ ఒక గ్రామ్ బంగారం నాణెం ఉచితంగా ఇస్తున్నది.
కల్యాణ్ జ్యువెల్లర్స్లో కొనుగోలు చేసే ఆభరణాల ధర రూ.25 వేలు దాటితే ఒక బంగారం నాణెం ఉచితంగా ఇస్తున్నారు. బంగారం ఆభరణాల తయారీ చార్జీలపై 60 శాతం రాయితీ అందిస్తున్నది. వజ్రాభరణాలపై జీరో మేకింగ్ చార్జీలు, ప్లాటినం ఆభరణాల తయారీపై 40 శాతం చార్జీ రాయితీ కల్పిస్తున్నది. ప్రముఖ బ్యాంకుల డెబిట్, క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే ఐదు శాతం అదనపు క్యాష్ బ్యాక్ సౌకర్యం అందుబాటులో ఉంది.
త్రిభువన్దాస్ భీమ్జీ సంస్థ వజ్రాభరణాల తయారీపై 50 శాతం చార్జీ రాయితీ ఇస్తున్నది. సెంకో గోల్డ్ ప్రతి గ్రామ్ బంగారంపై రూ.224 ధర తగ్గిస్తున్నది. వెండి నాణాలు, వజ్రాభరణాల తయారీపై సెంకో గోల్డ్ 100 శాతం చార్జీలు మినహాయిస్తున్నది. క్యారట్లైన్ అన్ని రకాల వజ్రాభరణాలపై 20 శాతం ధర తగ్గిస్తున్నది.