Jet Airways to resume | వచ్చే ఏడాది వేసవిలో జెట్ ఎయిర్వేస్ తిరిగి టేకాఫ్ కానున్నది. దేశీయ పూర్తిస్థాయి విమాన సర్వీసుగా సర్వీసులు ప్రారంభించనున్నది. తొలుత ఆరు విమానాలతో సేవలకు శ్రీకారం చుట్టనున్నది. అప్పుల ఊబిలో చిక్కుకుని నేలకు పరిమితమైన జెట్ ఎయిర్వేస్ పునరుద్ధరణకు జలాన్ కల్రాక్ కన్సార్టియం దాఖలు చేసిన ప్రణాళికకు ఆమోదం లభించింది. శరవేగంగా తమ ప్రణాళికను అమలు చేయడానికి చర్యలు తీసుకుంటామని జలాన్-కల్రాక్ కన్సార్టియం తెలిపింది.
మాజీ ఉద్యోగుల వేతన బకాయిలు, బ్యాంకర్ల రుణ బకాయిల చెల్లింపులతో తమ ప్రణాళిక అమలు చేస్తామని శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొంది. గత జూన్‌లో జెట్ ఎయిర్వేస్ పునరుద్ధరణకు జలాన్ కన్సార్టియం సమర్పించిన ప్రణాళికకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.
జెట్ ఎయిర్వేస్ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా జలాన్-కల్రాక్ కన్సార్టియం ప్రతినిధి మురారీ లాల్ జలాన్ సారధ్యం వహిస్తారు. మరోవైపు బుల్ ఇన్వెస్టర్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా ఆధ్వర్యంలోని స్టార్టప్ కంపెనీ ఆకాశ కూడా విమాన సర్వీసులను ప్రారంభించడానికి ప్రభుత్వం నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ లభించింది.