హైదరాబాద్, నవంబర్ 20: ఏరోస్పేస్ తయారీ కంపెనీల్లో ఒకటైన జెహ్ ఏరోస్పేస్ కొత్తగా హైదరాబాద్కు సమీపంలోని కొత్తూరు వద్దవున్న హోరైజన్ ఇండస్ట్రియల్ పార్క్లో తయారీ ప్లాంట్ను ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించింది. 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నెలకొల్పిన ఈ యూనిట్లో వచ్చే ఏడాది ఉత్పత్తిని ప్రారంభించనున్నట్టు కంపెనీ సీఈవో విశాల్ సంఘవి తెలిపారు.
ప్రస్తుతం సంస్థ చేతిలో 150 మిలియన్ డాలర్లకు పైగా ఆర్డర్ నిల్వలు ఉన్నాయి. ఈ యూనిట్ అందుబాటులోకి రానుండటంతో కంపెనీ సామర్థ్యం 2.50 లక్షల చదరపు అడుగులకు చేరుకోనున్నది.