Jack Ma | చైనా ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా సృష్టికర్త జాక్‌మా ( Jack Ma ) కు మరో షాక్ తగిలింది. అలీబాబా అనుబంధ సంస్థ యాంట్ గ్రూప్ (Ant Group) పై నియంత్రణ అధికారాన్ని కూడా కోల్పోనున్నారు. యాంట్ గ్రూప్ ఫౌండర్ కూడా జాక్‌మా (Jack Ma ) నే కావడం గమనార్హం. రెండేండ్ల క్రితం ప్రభుత్వ పెద్దలపైనా, బ్యాంకింగ్ వ్యవస్థపైనా అనుచిత వ్యాఖ్యలు చేసిన జాక్ మా ( Jack Ma ) కు నాటి నుంచి చిక్కులు మొదలయ్యాయి. ప్రభుత్వ పెద్దలకు కోపం తెప్పించినందుకు తాను స్థాపించిన ఫిన్‌టెక్ సంస్థ యాంట్ గ్రూప్‌పై నియంత్రణకు ఓటింగ్ హక్కులు కోల్పోనున్నారు.
కంపెనీ వాటాదారులు యాంట్ గ్రూప్ (Ant Group) ఓటింగ్ హక్కులను మార్చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. కంపెనీ ఫౌండర్, యాజమాన్యం, సిబ్బంది ఓటింగ్ హక్కుల్లో మార్పులు తీసుకొచ్చారు. తాజాగా యాంట్ గ్రూప్ (Ant Group) వాటాదారులు తీసుకున్న నిర్ణయంతో సంస్థపై జాక్‌మా ( Jack Ma ) పట్టు కోల్పోనున్నారు. ఈ నిర్ణయం వల్ల సంస్థ వాటాదారుల ఆర్థిక ప్రయోజనాలకు ఎటువంటి ముప్పు వాటిల్లబోదని యాంట్ గ్రూప్ (Ant Group) యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది.
2020 అక్టోబర్‌లో చైనా కమ్యూనిస్టు ప్రభుత్వ విధానాలను జాక్‌మా ( Jack Ma ) విమర్శించారు. నియంత్రణ సంస్థలను సృజనాత్మకతను అణగదొక్కేస్తున్నాయన్నారు. బ్యాంకింగ్ రూల్స్ `ఓల్డ్మ్యాన్స్ క్లబ్` మాదిరిగా ఉన్నాయన్నారు. చైనా బ్యాంకులు `పాన్ షాపు`ల్లా వ్యవహరిస్తున్నాయన్నారు. నాటి నుంచి జాక్‌మా ( Jack Ma ) పట్ల చైనా సర్కార్ కఠినంగా వ్యవహరిస్తున్నది. అదనపు నిధుల సేకరణ లక్ష్యంగా యాంట్ గ్రూప్ (Ant Group) ప్రతిపాదించిన ఐపీవోనూ చైనా నియంత్రణ సంస్థలు అడ్డుకున్నాయి. ఈ ఐపీవో ద్వారా 37 బిలియన్ డాలర్ల నిధులు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు జాక్ మా ( Jack Ma ). కానీ చైనా సర్కార్ కఠిన వైఖరి.. ప్రభుత్వ పెద్దల చర్యలతో కొన్ని నెలల పాటు బయటి ప్రపంచానికి జాక్ మా ( Jack Ma ) కనిపించలేదు.
యాంట్ గ్రూప్ (Ant Group) ఓటింగ్ హక్కులు మార్చేయడం ద్వారా జాక్‌మాను మరింత నియంత్రించడమే చైనా సర్కార్ లక్ష్యంగా కనిపిస్తున్నది. ఓటింగ్ హక్కులు, నియంత్రణ హక్కులు మార్చేయడంతో ప్రతిపాదిత యాంట్ గ్రూప్ (Ant Group) ఐపీవో మరింత జాప్యం కానున్నది. చైనాలో కంపెనీ ఓటింగ్ హక్కులు మారితే మూడేండ్ల వరకు స్టాక్మార్కెట్లో లిస్టింగ్ కాకూడదు. హంకాంగ్‌లో ఏడాది ఐపీవోకు వెళ్లడానికి నిబంధనలు అనుమతించవు.
యాంట్ గ్రూప్‌లో జాక్‌మా ( Jack Ma ), మరో తొమ్మిది ప్రధాన వాటాదారులు తాము ఇండిపెండెంట్‌గా వ్యవహరిస్తామని చెప్పారని సంస్థ తెలిపింది. ఇంతకుముందే జాక్ మా ( Jack Ma ).. యాంట్ గ్రూప్ (Ant Group) లో 50 శాతానికి పైగా వాటాను వదులుకునేందుకు సిద్ధ పడ్డారు. ప్రస్తుతం యాంట్ గ్రూప్ (Ant Group) లో ఆయన వాటా కేవలం 6.2 శాతమేనని సమాచారం.
యాంట్ గ్రూప్ (Ant Group) పూర్తిగా ఇండిపెండెంట్ డైరెక్టర్ల నియంత్రణలోకి వెళ్లనున్నది. ఐదో ఇండిపెండెంట్ డైరెక్టర్‌ను నియమించుకుంటామని యాంట్ గ్రూప్ (Ant Group) తెలిపింది. ఇక నుంచి తమ సంస్థపై వాటాదారుడు నేరుగా గానీ, పరోక్షంగా గానీ.. వ్యక్తిగతంగా గానీ, ఉమ్మడిగా నియంత్రణ అధికారం కలిగి ఉండరని పేర్కొంది.