Mahindra Thar Roxx | దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా తన ఆఫ్ రోడర్ ఎస్యూవీ కారు 5-డోర్ థార్ ఆవిష్కరణకు రంగం సిద్ధం చేసింది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఎస్యూవీ కార్ల సెగ్మెంట్ కార్ల మార్కెట్‌ను 5-డోర్ థార్ పూర్తిగా ప్రభావితం చేస్తారని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న 3-డోర్ థార్ కొనసాగింపుగా తీసుకొస్తున్న మహీంద్రా 5-డోర్ థార్’కు థార్ రాక్స్ (Mahindra Thar Roxx) అని నామకరణం చేసింది. స్వాతంత్ర్య దినోత్సవం నాడు 5-డోర్ థార్ – థార్ రాక్స్ (Mahindra Thar Roxx) కారును ఆవిష్కరించనున్నది. న్యూ బంపర్ డిజైన్‌తో థార్ రాక్స్ (Mahindra Thar Roxx) రాత్రి వేళ డ్రైవింగ్ సమయంలో ప్రకాశవంతంగా కనిపించేందుకు వీలుగా ఫ్రంట్‌లో నూతన ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్ ఏర్పాటు చేసింది. కారు గ్రిల్లె రూపురేఖలు పూర్తిగా మార్చేసింది. దీని ధర రూ.12.50 లక్షల నుంచి రూ.18.50 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంటుందని తెలుస్తోంది.
థార్ రాక్స్ (Mahindra Thar Roxx) కారు 18-అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ జత చేశారు. లాంగర్ వీల్ బేస్ మీద పొడవు పెంచేశారు. ప్రయాణికులు తేలిగ్గా కారు ఎక్కడానికి, దిగడానికి వీలుగా రేర్ డోర్స్ ఏర్పాటు చేశారు. వెనుక వైపు ప్రయాణికులు సౌకర్యవంతంగా కూర్చునేందుకు వీలుగా సీట్లు స్పేసియస్ గా అమర్చారు. లోయర్ వేరియంట్లలో స్టీల్ వీల్స్ ఉంటాయని తెలుస్తున్నది. రేర్ లో టెయిల్ లాంప్ డిజైన్ పూర్తిగా మార్చేస్తారని భావిస్తున్నారు. న్యూ లార్జర్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, సన్ రూఫ్ తోపాటు రేర్ ఏసీ వెంట్స్, రివైజ్డ్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్, ఫ్రంట్ పార్కింగ్ కెమెరా వంటి ఫీచర్లు ఉంటాయని తెలుస్తున్నది. థార్ రాక్స్ (Thar Roxx) కారు డిస్టినిక్టివ్ డిజైన్, ప్రీమియం క్వోటెంట్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ, ఎన్ హాన్స్ డ్ పెర్ఫార్మెన్స్ తో దూసుకొస్తోంది.
Amazon Prime Day 2024 Sale-iPhone 13 | రూ.50 వేలలోపు ధరకే ఐఫోన్ 13.. ఇవీ డిటెయిల్స్..’
Hyundai Venue | వెన్యూ.. ఎక్స్టర్లపై హ్యుండాయ్ డిస్కౌంట్లు.. గరిష్టంగా రూ.55 వేలు..!
Suzuki Motor Cycles | ఫెస్టివ్ కలర్స్ తో సుజుకి యాక్సెస్.. బర్గ్‌మన్ స్ట్రీట్ స్కూటర్లు.. ధరలిలా..!