Itel S23 | చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఐటెల్ (Itel) భారత్ వినియోగదారులకు బడ్జెట్ ధరలో మరో స్మార్ట్ ఫోన్ తీసుకొచ్చింది. ఐటెల్ ఎస్ (Itel S) సిరీస్‌లో ఐటెల్ ఎస్ 23 (Itel S23) పేరుతో వస్తున్న ఈ ఫోన్ రెండు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. యూనిసోక్ టీ 606 చిప్ సెట్, 8జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్ రామ్ వర్చువల్‌గా 16 జీబీ వరకు ఉపయోగించుకోవచ్చు. 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ సపోర్ట్ తో వస్తున్నది. సింగిల్ చార్జింగ్ తో 15 గంటల వరకు ప్లే బ్యాక్ టైం ఉంటుంది.
భారత్ మార్కెట్లో ఐటెల్ ఎస్23 (Itel S23) ఫోన్ 8జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ఫోన్ రూ.8,799లకే లభిస్తుంది. ఈ నెల 14 నుంచి ఈ-కామర్స్ జెయింట్ అమెజాన్లోనే ఈ ఫోన్ ఆర్డర్ చేసుకోవచ్చు. 4జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ కూడా మార్కె్ట్లోకి వస్తుందని తెలిపినా.. దాని ధర వివరాలు వెల్లడి కాలేదు. ఈ ఫోన్ మిస్టరీ వైట్, స్టార్రీ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభ్యం అవుతుంది.
ఆండ్రాయిడ్ 12 వర్షన్ మీద పని చేస్తున్న ఐటెల్ ఎస్23 (Itel S23) ఫోన్ 6.6-అంగుళాల హెచ్డీ + (720 x1612 పిక్సెల్స్) ఐపీఎస్ డిస్ ప్లే విత్ 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్‌తో వస్తుంది. సన్ లైట్, ఆల్ట్రా వయ్లెట్ లైట్ పడినప్పుడు ఈ ఫోన్ రంగు వేట్ షేడ్ నుంచి పింక్ కలర్‌కు మారుతుంది.
ఒక్టాకోర్ 12 ఎన్ఎం యూనిసోక్ టీ 606 ఎస్వోసీ ప్రాసెసర్, డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ విత్ ఎల్ఈడీ ఫ్లాష్ తో వస్తున్నది. 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా ఉంటుంది. అదనంగా సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా కలిగి ఉంటుంది.