Itel P55 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఐటెల్ (Itel) భారత్ మార్కెట్లోకి బడ్జెట్ సెగ్మెంట్లో తన ఐటెల్ పీ55 (Itel P55) ఫోన్ బుధవారం ఆవిష్కరించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. రెండు కలర్ ఆప్షన్లలో సింగిల్ స్టోరేజీ వేరియంట్‌గా అందుబాటులోకి వస్తుంది. రెండేండ్ల వారంటీ ఆఫర్ చేస్తోంది ఐటెల్ (Itel). కొనుగోలు చేసిన 100 రోజుల్లో ఉచితంగా స్క్రీన్ రీప్లేస్మెంట్ చేస్తుంది.
బ్లూ, గ్రీన్ కలర్ ఆప్షన్లలో ఐటెల్ పీ55 5జీ (Itel P55 5G) ఫోన్ సింగిల్ 8జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్‌గా వస్తోంది. ఈ ఫోన్ ధర రూ.9,999 (ఎక్స్ షోరూమ్) పలుకుతుంది. అక్టోబర్ నాలుగో తేదీ నుంచి అమెజాన్ ఇండియా వెబ్ సైట్ ద్వారా సేల్స్ ప్రారంభం అవుతాయి.
6.6-అంగుళాల హెచ్డీ + (1600 x 700 పిక్సెల్స్) డిస్ ప్లే విత్ 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఒక్టాకోర్ మీడియా టెక్ డైమెన్సిటీ 6080 ఎస్వోసీ చిప్ సెట్ కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 13 వర్షన్‌పై పని చేస్తున్న ఈ ఫోన్ మైక్రో ఎస్డీ కార్డు సాయంతో 250 జీబీ వరకూ ఇంటర్నల్ స్టోరేజీ కెపాసిటీ పెంచుకోవచ్చు.
ఐటెల్ పీ55 5జీ (Itel P55 5G) ఫోన్ 50-మెగా పిక్సెల్ ప్రైమరీ రేర్ కెమెరా యూనిట్, సెకండరీ ఏఐ ఆధారిత్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయి. ఇంకా సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 8-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటుంది. 18 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుంది. అథంటికేషన్ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, 3.5ఎంఎం ఆడియో జాక్, 5జీ, 4జీ వోల్ట్, వై-ఫై, బ్లూటూత్ 5.1, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది.