Itel A50- A50C | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఐటెల్ (Itel) తన బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్లు – ఐటెల్ ఏ50 (Ite A50), ఐటెల్ ఏ50సీ (Itel A50C) ఫోన్లను భారత్ మార్కెట్లో మంగళవారం ఆవిష్కరించింది. యూనిసోక్ టీ603 ప్రాసెసర్ తో వస్తున్న ఈ ఫోన్లలో 8-మెగా పిక్సెల్ రేర్ కెమెరాలు, ఐటెల్ ఏ50 ఫోన్ 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ, ఐటెల్ ఏ50సీ ఫోన్ 4000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తున్నాయి. నోటిఫికేషన్లు, ఇతర సమాచారం కోసం ఐ-ఫోన్లలో మాదిరిగా డైనమిక్ బార్ ఫీచర్ కూడా ఉంటుంది.
ఐటెల్ ఏ50 ఫోన్ 3జీబీ ర్యామ్ విత్ 64 జీబీ స్టోరేజీ రూ.6,099, 4జీబీ ర్యామ్ విత్ 64 జీబీ స్టోరేజీ రూ.6,499 పలుకుతుంది. సియాన్ బ్లూ, మిస్ట్ బ్లాక్, లైమ్ గ్రీన్, షిమ్మర్ గోల్డ్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ప్రస్తుతం అమెజాన్ ద్వారా సేల్స్ ప్రారంభం అయ్యాయి. ఐటెల్ ఏ50సీ ఫోన్ 2 జీబీ ర్యామ్ విత్ 64 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.5,699 పలుకుతుంది. ఈ ఫోన్ డాన్ బ్లూ, మిస్ట్ ఆక్వా, సఫైర్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.
ఐటెల్ ఏ50, ఐటెల్ ఏ50సీ ఫోన్లు రెండు ఆండ్రాయిడ్ 14 (గో ఎడిషన్) వర్షన్ పై పని చేస్తాయి. ఐటెల్ ఏ50 ఫోన్ 6.56 అంగుళాల డిస్ ప్లే, ఐటెల్ ఏ50సీ ఫోన్ 6.6 అంగుళాల స్క్రీన్ కలిగి ఉంటాయి. కాల్స్, బ్యాటరీ స్టేటస్ తదితర విషయాలు తెలిపే నోటిఫికేషన్ల కోసం డైనమిక్ బార్ ఫీచర్ జత చేశారు. రెండు మోడల్ ఫోన్లూ ఒక్టాకోర్ యూనిసోక్ టీ603 ప్రాసెసర్‌తో పని చేస్తాయి. 4జీబీ ర్యామ్ ఫోన్లలో మెమొరీ ఫ్యూషన్ టెక్నాలజీ అందుబాటులో ఉంది. 4జీబీ ర్యామ్‌ను వర్చువల్‌గా 8 జీబీ వరకూ పొడిగించుకోవచ్చు.
ఐటెల్ ఏ50, ఐటెల్ ఏ50సీ ఫోన్లలో ఏఐ బ్యాక్డ్ 8-మెగా పిక్సెల్ మెయిన్ సెన్సర్ కెమెరా, 5-మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. బయో మెట్రిక్ అథంటికేషన్ కోసం ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఫేస్ అన్‌లాక్‌కు మద్దతుగా ఉంటుంది. ఐటెల్ ఏ50 ఫోన్ 10వాట్ల చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ, ఐటెల్ ఏ50సీ ఫోన్ 5వాట్ల చార్జింగ్ మద్దతుతో 4000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వచ్చాయి.
Realme 13 | త్వరలో భారత్ మార్కెట్లో రియల్ మీ 13 సిరీస్ ఫోన్ల ఆవిష్కరణ..?
Maruti Suzuki Ertiga | ఎంపీవీ కార్లకు గిరాకీ.. మారుతి సుజుకి ఎర్టిగా యమ పాపులర్..!
BSA Gold Star 650 | 15న భారత్ మార్కెట్లో బీఎస్ఏ గోల్డ్ స్టార్ 650 బైక్ లాంచింగ్.. ఇవీ డీటెయిల్స్..!
Realme C63 5G | 32-ఎంపీ ఏఐ ఫీచర్లతో రియల్మీ నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్.. ఇవీ డీటెయిల్స్..!