Itel A50 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఐటెల్ (Itel) తన ఐటెల్ ఏ50 (Itel A50) ఫోన్ ను త్వరలో భారత్ మార్కెట్లో లాంచ్ చేయనున్నది. అధికారికంగా లాంచింగ్ తేదీ ప్రకటించకున్నా, ఫోన్ ధర, స్పెషిఫికేషన్స్ మీడియాలో లీక్ అయ్యాయి. బడ్జెట్ ధరలోనే ఐటెల్ ఏ50 ఫోన్ అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. గ్లోబల్ మార్కెట్లలో యూనిసోక్ టీ603 ఎస్వోసీ ప్రాసెసర్ తో విడుదల చేశారు. 8-మెగా పిక్సెల్ రేర్ కెమెరా, 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తోంది. వచ్చే వారం భారత్ మార్కెట్లోకి రానున్న ఐటెల్ ఏ50 ఫోన్ ధర రూ.7,000 లోపు ఉంటుందని భావిస్తున్నారు.
గత జనవరిలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించిన ఐటెల్ ఏ70 ఫోన్ 4జీబీ ర్యామ్ విత్ 64 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.6,299, 4 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.6,799, 4జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.7,299 పలుకుతుంది. ఐటెల్ ఏ50 ఫోన్ పలు కలర్ ఆప్షన్లు, మెమోరీ ఆప్షన్లలో లభిస్తుందని భావిస్తున్నారు. 6.56 అంగుళాల హెచ్డీ+ డిస్ ప్లే కలిగి ఉంటుంది. అంతే కాదు కొనుగోలు చేసిన 100 రోజుల్లో వన్ టైం ఫ్రీ స్క్రీన్ రీప్లేస్ మెంట్ ఆఫర్ కూడా అందిస్తుంది. సియాన్ బ్లూ, లైం గ్రీన్, మిస్టీ బ్లాక్, షిమ్మర్ గోల్డ్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.
ఐటెల్ ఏ50 ఫోన్ 720×1612 పిక్సెల్స్ రిజొల్యూషన్ తోపాటు 6.6 అంగుళాల డిస్ ప్లే కలిగి ఉంటుంది. ఒక్టాకోర్ యూనిసోక్ టీ603 ప్రాసెసర్ తో పని చేస్తుంది. 4జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ర్యామ్ వేరియంట్ గా వస్తుందని భావిస్తున్నారు. 8-మెగా పిక్సెల్ రేర్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 5-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటాయి. ఆండ్రాయిడ్ 14 ఓఎస్ సిస్టమ్ తో పని చేస్తుందీ ఫోన్. 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తున్న ఫోన్.. సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ కలిగి ఉంటుంది.