న్యూఢిల్లీ, ఆగస్టు 14: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను రూ.5,180.12 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది ఐటీసీ లిమిటెడ్. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.4,462.25 కోట్ల లాభంతో పోలిస్తే 16 శాతం అధికం. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ. 19,831.27 కోట్ల నుంచి రూ.18, 639.48 కోట్లకు తగ్గినట్లు పేర్కొంది. నిర్వహణ ఖర్చులు ఏడాది ప్రాతిపదికన 12.53 శాతం తగ్గి రూ.12,421.77 కోట్లకు పరిమితమయ్యాయి.