హైదరాబాద్, అక్టోబర్ 15: హైదరాబాద్‌లో మరో హోటల్‌ను ప్రారంభించబోతున్నట్టు ఐటీసీ హోటల్స్ ప్రకటించింది. ఇప్పటికే నగరంలో రెండు హోటళ్లను నిర్వహిస్తున్న సంస్థ.. తాజాగా వెల్కమ్హోటల్ బ్రాండ్‌తో దీనిని ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొంది.
హైదరాబాద్‌తోపాటు ఏపీలోని నెల్లూరులో నెలకొల్పనున్న ఈ హోటళ్లను డీఎస్ఆర్ హాస్పిటాల్టీ సర్వీసెస్ నిర్వహించనున్నది. హైదరాబాద్‌లో 117 గదులు, నెల్లూరులో 127 గదులతో హోటళ్లను ఏర్పాటు చేస్తున్నట్టు ఐటీసీ హోటల్స్ లిమిటెడ్ ఎండీ అనిల్ చద్దా తెలిపారు.