ITC-Sanjiv Puri | ఐటీసీ.. అంటే దేశంలోనే పేరొందిన బ్రాండ్.. బ్లూ చిప్ కంపెనీగా.. పేపర్ టు ఎఫ్ఎంసీజీ గూడ్స్ వరకు వివిధ రకాల వస్తువుల తయారీలో పేరొందిన కంపెనీ.. దేశీయ స్టాక్ మార్కెట్లలో టాప్ లిస్ట్‌లో కొనసాగుతోంది. ఈ తరుణంలో ఐటీసీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ పూరీ వేతనం భారీగా పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం (2022-23)లో సంజీవ్ పూరీ వేతనం ఒక్కసారిగా 53.08 శాతం పెరిగింది. అంటే రూ.16.31 కోట్ల వేతనం అందుకున్నారు సంజీవ్ పూరీ.
సంజీవ్ పూరీ కనీస వేతనం రూ.2.88 కోట్లు, ఇతర బెనిఫిట్ల కింద రూ.57 లక్షలు, పెర్ఫార్మెన్స్ బోనస్ లేదా లాంగ్ టర్మ్ ఇన్సెంటివ్‌లు లేదా కమీషన్ రూ.12.86 కోట్లు. మొత్తం సంజీవ్ పూరీ గత ఆర్థిక సంవత్సర వేతనం రూ.16.31 కోట్లు.
2021-22 ఆర్థిక సంవత్సరానికి సంజీవ్ పూరీ పూర్తి వేతనం రూ.10.66 కోట్లు. అందులో కనీస వేతనం రూ.2.66 కోట్లు. ఇతర బెనిఫిట్లు రూ.49.63 లక్షలు, పెర్ఫార్మెన్స్ బోనస్ లేదా కమిషన్ రూ.7.52 కోట్లు.
ఇదిలా ఉంటే ఐటీసీ వాటాదారుల సర్వ సభ్య సమావేశం వచ్చేనెల 11వ తేదీన నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది జూలై 22న సంస్థ సీఎండీగా వైదొలగనున్న సంజీవ్ పూరీని తిరిగి మరో ఐదేండ్లు సీఎండీగా నియమిస్తూ కంపెనీ బోర్డు నిర్ణయం తీసుకున్నది. సంజీవ్ పూరీ 2019 జూలై 22న కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు.