ముంబై, మే 19: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజూ నష్టపోయాయి. అమెరికా రేటింగ్‌ను తగ్గిస్తూ మూడీస్ తీసుకున్న నిర్ణయంతో ప్రపంచ మార్కెట్లు కుప్పకూలాయి. దీంతోపాటు ఐటీ, బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాలు పోటెత్తడంతో సూచీలు భారీగా నష్టపోయాయి. ఒక దశలో 82 వేల పాయింట్ల దిగువకు పడిపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 271.17 పాయింట్లు నష్టపోయి 82,059.42 వద్ద ముగిసింది.
మరో సూచీ నిఫ్టీ సైతం 74.35 పాయింట్లు కోల్పోయి 24,945.45 వద్ద స్థిరపడింది. తీవ్ర ఒడిదుడుకుల మధ్య ప్రారంభమైన సూచీలు చివరి వరకు బేరీష్ ట్రెండ్‌ను కొనసాగించాయి. మధ్యాహ్నాం తర్వాత అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు మార్కెట్లను నష్టాల్లోకి నెట్టాయని దలాల్‌స్ట్రీట్ వర్గాలు వెల్లడించాయి.