హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రం నుంచి ఐటీ ఎగుమతులు పెరగడంలో గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లు కీలక పాత్రను పోషిస్తాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డీ శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. శుక్రవారం టీ హబ్‌లో నిర్వహించిన జీసీసీ ఇన్నోవేషన్ సమ్మిట్-2024 కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
అనంతరం శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. స్టార్టప్ ఎకోసిస్టంలో టీ హబ్ ఎంతో సమర్ధవంతంగా పనిచేస్తున్నదని కొనియాడారు.టీ హబ్ తాతాల్కిక సీఈవో సుజిత్ జాగీర్దార్, రాష్ట్ర ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు పాల్గొన్నారు.