హైదరాబాద్, జూలై 28: ఐఎస్పీ, ఐటీ/ఐటీఈఎస్ సేవల సంస్థ నెట్లింక్స్ లిమిటెడ్ అంచనాలకుమించి రాణించింది. 2023-24 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను సంస్థ రూ.1.65 కోట్ల నికర లాభాన్ని గడించింది. ఏడాది క్రితం నమోదైన లాభంతో పోలిస్తే 26 రెట్లు పెరగగా.. వరుస త్రైమాసికంతో పోలిస్తే 177 శాతం అధికం.
అటు ఆదాయం 132. 6 శాతం ఎగబాకి రూ.4.66 కోట్లకు చేరుకున్నది. తొలి త్రైమాసికంలో అంచనాలకుమించి రాణించినట్లు నెట్లింక్స్ లిమిటెడ్ ఎండీ, ప్రమోటర్ లోక మనోహర్ రెడ్డి తెలిపారు.