BOB-IRCTC Credit Card | ఐఆర్సీటీసీతో కలిసి బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) అనుబంధ బ్యాంక్ ఆఫ్ బరోడా ఫైనాన్సియల్ సొల్యూషన్స్ కొత్త క్రెడిట్ కార్డు తీసుకొచ్చింది. టికెట్ల బుకింగ్స్‌పై రైల్వే ప్రయాణికులకు ప్రయోజనం కల్పించడానికి ఈ క్రెడిట్ కార్డు తీసుకొచ్చారు. ఈ కోబ్రాండెడ్ రూపే క్రెడిట్ కార్డు సాయంతో తరుచుగా రైలు ప్రయాణాలు చేసేవారు కొంత మొత్తం ఆదా చేయొచ్చు. రైలు టికెట్లతోపాటు పెట్రోల్ కొనుగోళ్లు, సరుకుల కొనుగోళ్లకు ఈ క్రెడిట్ కార్డును వాడుకోవచ్చు.
ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారా గానీ, యాప్ ద్వారా గానీ రైలు టికెట్ బుక్ చేసుకుంటే, గరిష్టంగా 40 రివార్డు పాయింట్లు పొందొచ్చు. ప్రతిసారి టికెట్ బుకింగ్‌పై ఒకశాతం ట్రాన్సాక్షన్ చార్జీ నుంచి రాయితీ తీసుకోవచ్చు. కారు జారీ చేసిన 45 రోజుల్లో రూ.1000, అంతకంటే ఎక్కువ మొత్తంలో లావాదేవీలు జరిపితే 1000 బోనస్ పాయింట్లు లభిస్తాయి.
సరుకులు కొనుగోలు చేస్తున్నప్పుడు ప్రతి రూ.100లకు నాలుగు రివార్డు పాయింట్లు, ఇతర కొనుగోళ్లపై రెండు రివార్డు పాయింట్లు లభిస్తాయి. పెట్రోల్ పంపుల వద్ద ఫ్యూయల్ సర్చార్జిలో ఒకశాతం రాయితీ ఇస్తారు. ప్రతి క్రెడిట్ కార్డు వినియోగదారు తమకు వచ్చిన రివార్డు పాయింట్లను ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా యాప్ ద్వారా రీడీమ్ చేసుకోవచ్చు. అయితే కస్టమర్లు ఐఆర్సీటీసీ వెబ్సైట్లో లాగిన్ అయి కార్డును అనుసంధానించాల్సి ఉంటుంది. ఐఆర్సీటీసీ ద్వారా ప్రతి రోజూ 7.5 లక్షల వరకు టికెట్లు బుక్ అవుతాయి.