IRCTC Bus Ticketing | ఇక బస్సు టికెటింగ్.. ట్రయల్ రన్లో 2,500 బుకింగ్స్
IRCTC BUS Booking | రైళ్లతోపాటు విమాన టికెట్ల బుకింగ్ వసతి కల్పించిన ఐఆర్సీటీసీ.. ఇక బస్సు టికెటింగ్ కూడా ప్రారంభించింది.

IRCTC Bus Ticketing | భారతీయ రైల్వేస్ టికెటింగ్ సంస్థ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) ఇప్పటికే విమానాల టికెట్ బుకింగ్ సేవలందిస్తున్నది. ఇక నుంచి బస్సుల్లో ప్రయాణానికి టికెట్ల బుకింగ్ సేవలందిస్తున్నది.
ప్రయాణికులు.. ఐఆర్సీటీసీ యాప్ ద్వారా బస్ ప్రయాణ టికెట్లు బుక్ చేసుకోవచ్చు. 22 రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో రెండు విభిన్న కేంద్రాల నుంచి బస్సులు నడుస్తున్నాయి. అయితే ఐఆర్సీటీసీ ద్వారా బస్సు ప్రయాణానికి టికెట్ల బుకింగ్‌కు అదనంగా ఫీజు వసూలు చేయరు. ప్రైవేట్, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల బస్సుల ప్రయాణ టికెట్ల బుకింగ్ చేపడుతుంది.
సుదీర్ఘకాలం ట్రయల్ రన్ సాగిన తర్వాత రెండు రోజుల క్రితం పూర్తి స్థాయిలో ఐఆర్సీటీసీ ద్వారా బస్సు టికెట్ల బుకింగ్ ప్రారంభమైంది. ట్రయల్ రన్లో ప్రతిరోజూ 2000 నుంచి 2500 మంది ప్రయాణికులు టికెట్ బుకింగ్ చేసుకున్నారు. బస్సులో ప్రయాణించాలని భావించే వారు https://www.bus.irctc.co.in/homeకెళ్లి మీరు వెళ్లే కేంద్రానికి టికెట్ బుక్ చేసుకోవచ్చు.
దాదాపు అన్ని రాష్ట్రాలు బస్సులు నడుపుతున్నాయి. దేశవ్యాప్తంగా బస్సు సర్వీసులు నడుపుతున్న 50 వేల మంది బస్సు ఆపరేటర్లు ఐఆర్సీటీసీతో కలిసి పని చేయడానికి ముందుకు వచ్చాయి. ఐఆర్సీటీసీ సొంత పేమెంట్ గేట్‌వే.. ఐఆర్సీటీసీ-ఈపే కూడా అందుబాటులో ఉంటుంది. అలాగే టికెట్ల క్యాన్సిలేషన్ ఫెసిలిటీ కూడా ఉంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి:
ఐఫోన్13కు చిప్‌ల కొరత.. యాపిల్ షేర్లు పతనం
Power Crisis | ప్రపంచానికి కరెంటు కష్టాలు.. ఇక పాలు కూడా పితకలేరేమో..
అదానీ నిమిషానికి ఎంత సంపాదిస్తాడో తెలుసా? సగటు వ్యక్తి జీవితకాలం కష్టపడినా అంత రాదు!!
రూ 15 లక్షల లోపు రానున్న టాప్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే..!
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- bus tickets
- irctc
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

