iQOO Z9s | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఐక్యూ జడ్9ఎస్ సిరీస్ ఫోన్లను ఈ నెల 21న భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. ఐక్యూ జడ్9 సిరీస్ ఫోన్లలో ఐక్యూ జడ్9, ఐక్యూ జడ్9 ప్రో ఫోన్లు ఉంటాయి. ఐక్యూ జడ్9 ప్రో ఫోన్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్, ఐక్యూ జడ్9 ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ తో వస్తున్నాయి. రెండు ఫోన్లూ ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ అమెజాన్ ద్వారా లభిస్తాయి.
ఓనిక్స్ గ్రీన్, మార్బుల్ ప్యాటర్న్, గ్లూసీ ఫినిష్ రంగుల్లో ఐక్యూ జడ్9ఎస్, ఐక్యూ జడ్9ఎస్ ప్రో ఫోన్లు వస్తాయని ఐక్యూ తెలిపింది. ఓవల్ షేప్డ్ మాడ్యూల్ తోపాటు డ్యుయల్ రేర్ కెమెరాలతో వస్తున్నాయి. 50-మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 882 సెన్సర్ విత్ ఓఐఎస్ సపోర్ట్, 8-మెగా పిక్సెల్ ఆల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ కెమెరా ఉంటాయి. ఏఐ ఎరేజ్, ఏఐ ఫోటో ఎన్ హాన్స్ వంటి పలు కెమెరా ఫోకస్డ్ ఏఐ ఫీచర్లు జత చేశారు.