iQOO Z9s Pro 5G | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఐక్యూ (iQoo) తన ఐక్యూ జడ్9ఎస్ 5జీ (iQoo Z9s 5G0 సిరీస్ ఫోన్లను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. వీటిల్లో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్, మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్లు ఉన్నాయి. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతో 6.77 అంగుళాల అమోలెడ్ స్క్రీన్ కలిగి ఉంటాయి. రెండు ఫోన్లూ ఆండ్రాయిడ్ 14 బేస్డ్ కంపెనీ ఫన్ టచ్ ఓఎస్ 14 వర్షన్ పై పని చేస్తాయి. 80 వాట్ల మద్దతుతో ఐక్యూ జడ్9ఎస్ ప్రో 5జీ (iQoo Z9s Pro 5G), 44వాట్ల మద్దతుతో ఐక్యూ జడ్9ఎస్ 5జీ (iQoo Z9s 5G) ఫోన్లలో 5500 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తున్నాయి.
ఐక్యూ జడ్9ఎస్ ప్రో 5జీ (iQoo Z9s Pro 5G) ఫోన్ 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజీ వేరియంట్ రూ.24,999, 8జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.26,999, 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.28,999లకు లభిస్తాయి. ఈ నెల 23 నుంచి సేల్స్ ప్రారంభం అవుతాయి. ఫ్లాంబోయంట్ ఆరెంజ్, లుక్స్ మార్బుల్ కలర్ ఆప్షన్లలో లభిస్తాయి.
ఐక్యూ జడ్9ఎస్ 5జీ (iQoo Z9s 5G) ఫోన్ 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజీ వేరియంట్ రూ.19,999, 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేిరయంట్ రూ.21,999, 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.23,999లకు లభిస్తాయి. ఈ నెల 29 నుంచి సేల్స్ మొదలవుతాయి. ఓనిక్స్ గ్రీన్, టైటానియం మ్యాట్టె కలర్ ఆప్షన్లలో లభిస్తాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకు కార్డులపై కొనుగోలు చేసే వారికి ఐక్యూ జడ్9ఎస్ ప్రో (IQoo Z9s Pro 5G) ఫోన్ మీద రూ.3000, ఐక్యూ జడ్9ఎస్ (IQoo Z9s 5G) ఫోన్ మీద రూ.2000 రాయితీ ప్రకటించింది ఐక్యూ. అమెజాన్, ఐక్యూ ఈ-స్టోర్ లో ఫోన్లు కొనుగోలు చేయొచ్చు.
ఐక్యూ జడ్9ఎస్ ప్రో 5జీ, ఐక్యూ జడ్9ఎస్ 5జీ ఫోన్లు ఆండ్రాయిడ్ 14 బేస్డ్ ఫన్ టచ్ ఓఎస్ 14 ఔటాఫ్ బాక్స్ వర్షన్ పై పని చేస్తాయి. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 6.77 అంగుళాల ఫుల్ హెచ్డీ+ (1080×2392 పిక్సెల్స్) అమోలెడ్ స్క్రీన్, 387 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ కలిగి ఉంటాయి. ఐక్యూ జడ్9ఎస్ ప్రో (iQoo Z9s Pro 5G) ఫోన్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్, ఐక్యూ జడ్9ఎస్ 5జీ (iQoo Z9s 5G) ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్‌పై పని చేస్తాయి.
రెండు స్మార్ట్ ఫోన్లూ 50-మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా విత్ సోనీ ఐఎంఎక్స్ 882 సెన్సర్ కలిగి ఉంటాయి. స్టాండర్డ్ మోడల్ 2-మెగా పిక్సెల్ డెప్త్ సెన్సర్, ప్రో మోడల్ 8-మెగా పిక్సెల్ ఆల్ట్రావైడ్ యాంగిల్ కెమెరాతో వస్తాయి. రెండు ఫోన్లలోనూ సెల్ఫీలూ వీడియోల కోసం 16 మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటుంది. రెండు ఫోన్లూ 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై 5.4, జీపీఎస్, యూఎస్బీ టైప్ సీ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటాయి. యాక్సెలరో మీటర్, ఈ-కంపాస్, గైరోస్కోప్, ప్రాగ్జిమిటీ సెన్సర్, అంబియెంట్ లైట్ సెన్సర్ ఉంటాయి.