iQOO | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఐక్యూ.. తాజా అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్-2024 సందర్భంగా ఆఫర్లు అందిస్తోంది. ఈ నెల 27 నుంచి అమెజాన్ ఫెస్టివల్ సేల్ ప్రారంభం అవుతున్నది. ఇక అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు ఈ నెల 26 నుంచి ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. ఈ సందర్భంగా ఐక్యూ (iQoo) పలు స్మార్ట్ ఫోన్లపై ఆకర్షణీయ ఆఫర్లు అందిస్తున్నది. ఐక్యూ జడ్9ఎక్స్ 5జీ (iQoo Z9x 5G), ఐక్యూ జడ్9 లైట్ 5జీ (iQoo Z9 Lite 5G), ఐక్యూ జడ్9ఎస్ ప్రో (iQoo Z9s Pro), ఐక్యూ నియో 9 ప్రో (IQoo Neo 9 Pro), ఐక్యూ 12 5జీ (iQoo 12 5G) ఫోన్లతోపాటు ఐక్యూ టీడబ్ల్యూఎస్ 1ఈ (iQoo TWS 1e) ఇయర్ బడ్స్ మీద ఆకర్షణీయ ఆఫర్లతో తక్కువ ధరలకే అందిస్తున్నది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ -2024 కింద ఎస్బీఐ క్రెడిట్ లేదా డెబిట్ కార్డులతో కొనుగోలు చేసే వారికి పది శాతం ఇన్ స్టంట్ డిస్కౌంట్, ఎక్స్చేంజ్ ఆఫర్లతో ధర తగ్గింపు లభిస్తుంది.
ఐక్యూ జడ్ 9 లైట్ ఫోన్ 4జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ లాంచింగ్ ధర రూ.10,499 కాగా.. ఫెస్టివల్ ఆఫర్ లో రూ.9,499లకే లభిస్తుంది. ఇక ఐక్యూ జడ్9ఎక్స్ ఫోన్ 4జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.12,999 నుంచి డిస్కౌంట్ పై రూ.10,749లకు అందిస్తోంది.
ఐక్యూ జడ్9ఎస్ 6జీ, ఐక్యూ జడ్9ఎస్ ప్రో 5జీ ఫోన్లపై ఆరు నెలల వరకూ నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.
ఐక్యూ జడ్9ఎస్ ఫోన్ 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.19,999 నుంచి రూ.17,499లకు తగ్గించారు. ఐక్యూ జడ్9ఎస్ ప్రో ఫోన్ 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ లాంచింగ్ ధరపై రూ.3,000 తగ్గింపుతో రూ.21,999లకే సొంతం చేసుకోవచ్చు. ఈ హై ఎండ్ ప్రో వేరియంట్ మీద ఎక్స్చేజ్ ఆఫర్ లో మరో రూ.1500 రాయితీ పొందొచ్చు.
ఐక్యూ నియో 9 ప్రో ఫోన్ కొనుగోలుపై ఆరు నెలల వరకూ నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ లభిస్తుంది. 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ లాంచింగ్ ధర రూ.35,999 కాగా, డిస్కౌంట్లతో రూ.31,999లకే సొంతం చేసుకోవచ్చు. ఎక్స్చేంజ్ ఆఫర్ కింద మరో రూ.2000 ధర తగ్గింపు లభిస్తుంది.
గతేడాది డిసెంబర్లో ఆవిష్కరించిన ఐక్యూ 12 5జీ ఫోన్ 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.52,999 నుంచి రూ.47,999లకు దిగి వస్తుంది. దీనిపై తొమ్మిది నెలల వరకూ నో-కాస్ట్ ఈఎంఐ బెనిఫిట్లతోపాటు ఎక్స్చేంజ్ ఆఫర్ కింద రూ.2,000 రాయితీ లభిస్తుంది.
అదనంగా ఐక్యూ టీడబ్ల్యూఎస్ 1ఈ ఇయర్ బడ్స్ ధర రూ.1999 నుంచి రూ.1599లకు తగ్గించారు.