iQoo Z9 Turbo+ | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఐక్యూ.. తన ఐక్యూ జడ్9 టర్బో+ ఫోన్ ను వచ్చేవారం చైనా మార్కెట్లో ఆవిష్కరించనున్నది. వివో సబ్ బ్రాండ్ ఫోన్ల తయారీ సంస్థ ఐక్యూ తన కొత్త జడ్ సిరీస్ ఫోన్లలో త్వరలో మార్కెట్లోకి రానున్న జడ్9 టర్బో+ ఫోన్ స్పెషిఫికేషన్లను వెల్లడించనున్నది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9300 ఎస్వోసీ + ప్రాసెసర్, 6400 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ కలిగి ఉంటుంది. ఈ నెల 24న చైనా మార్కెట్లో ఆవిష్కరిస్తారు. త్వరలో భారత్ తోపాటు గ్లోబల్ మార్కెట్లలో ఆవిష్కరిస్తారని సమాచారం.
ఈ గేమింగ్ ఫోకస్డ్ ఫోన్ 1.5కే రిజొల్యూషన్ అండ్ 72ఎఫ్పీఎస్ డెలివరీ చేస్తుంది. 1.5 కే రిజొల్యూషన్ తో 6.7 అంగుళాల డిస్ ప్లే కలిగి ఉంటుంది. డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ విత్ 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, 8-మెగా పిక్సెల్ సెకండరీ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 16-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా కలిగి ఉంటుంది. 80వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 6400 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తోంది. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ ఆర్జిన్ ఓఎస్ వర్షన్ పై పని చేస్తుంది. ప్రస్తుతం భారత్ మార్కెట్లో ఐక్యూ జడ్9, ఐక్యూ జడ్9ఎక్స్, ఐక్యూ జడ్9 లైట్ ఫోన్లు లభిస్తున్నాయి.