iQOO Z9 Turbo+ | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఐక్యూ తన ఐక్యూ జడ్9 టర్బో + ఫోన్ ను త్వరలో చైనా మార్కెట్లో ఆవిష్కరించనున్నది. గత ఏప్రిల్ నెలలో చైనాలో ఆవిష్కరించిన ఐక్యూ జడ్9 టర్బోతో జత కలుస్తుందని భావిస్తున్నారు. ఐక్యూ జడ్9 టర్బో+ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9300 + ప్రాసెసర్ తో వస్తుంది. 144 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 1.5 కే ఫ్లాట్ 6.78 అంగుళాల డిస్ ప్లే కలిగి ఉంటుంది. ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా ఉంటది. 50-మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8-మెగా పిక్సెల్ సెకండరీ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 16-మెగా పిక్సెల్ సెన్సర్ ఉంటుంది.
గత ఏప్రిల్ లో చైనాలో ఆవిష్కరించిన ఐక్యూ జడ్9 టర్బో ఫోన్ ఆండ్రాయిడ్ 15 బేస్డ్ ఆర్జిన్ ఓఎస్ 5.4 వర్షన్ పై పని చేస్తుంది. సెక్యూరిటీ కోసం ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఫేసియల్ రికగ్నిషన్ ఫీచర్ తో వస్తుంది. 144 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 6.78 అంగుళాల ఫుల్ హెచ్డీ + అమోలెడ్ స్క్రీన్ తో వస్తోంది. 80వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 6000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ కలిగి ఉంటుంది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8ఎస్ జెన్ 3 ఎస్వోసీ ప్రాసెసర్ పై పని చేస్తుంది.