iQoo Z7 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ `ఐక్యూ (iQoo)` దేశీయ మార్కెట్లోకి జడ్7 5జీ ఫోన్ ఆవిష్కరణకు మూహూర్తం ఖరారైంది. ఈ నెల 21న ఐక్యూ జడ్7 5జీ ఫోన్ కస్టమర్లకు అందుబాటులోకి రానున్నది. ఈ నేపథ్యంలో దాని ధర, కలర్ ఆప్షన్లు లీకయ్యాయి. రెండు కలర్ ఆప్షన్లు, రెండు రామ్ విత్ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్లలో లభ్యం అవుతాయని భావిస్తున్నారు. ఐక్యూ జడ్7 5జీ (iQoo Z7 5G) ఫోన్ 8జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుందని తెలుస్తున్నది. దీని ధర రూ.20 వేల లోపు ఉండొచ్చునని అంచనా. ఈ-కామర్స్ జెయింట్ అమెజాన్ వెబ్సైట్లోనే ఈ ఫోన్ విక్రయాలు జరుగుతాయి.
ఐక్యూ జడ్7 5జీ (iQoo Z7 5G) ఫోన్.. మీడియా టెక్ డైమెన్సిటీ 920 5జీ ఎస్వోసీ చిప్సెట్తో వస్తుంది. ఇది ఫన్‌టచ్ ఓఎస్ 13 వర్షన్‌పై పని చేస్తుందని చెబుతున్నారు. అలాగే 64 మెగా పిక్సెల్ ఓఐఎస్ కెమెరా సిస్టమ్ విత్ సపోర్ట్స్ 44 వాట్స్ ఫ్లాష్ చార్జితో వస్తుందని తెలుస్తున్నది. 25 నిమిషాల్లో 50 శాతం చార్జింగ్ అవుతుంది. అమోల్డ్ డిస్ప్లే అండ్ ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఫర్ అథంటికేషన్ లభించింది.
91మొబైల్స్ వెబ్సైట్ కథనం ప్రకారం ఐక్యూ జడ్7 5జీ (iQoo Z7 5G) ఫోన్.. భారత్ మార్కెట్లో 6జీబీ, 8 జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ సామర్థ్యంతో వస్తుందని అంచనా. బేస్ 6జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ఫోన్ ధర రూ.17 వేలు పలుకుతుందని చెబుతున్నారు. నార్వేబ్లూ, పసిఫిక్ నైట్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉండొచ్చు.
ఐక్యూ జడ్6కి కొనసాగింపుగా ఐక్యూ జడ్7 5జీ (iQoo Z7 5G) ఫోన్ వస్తుందని భావిస్తున్నారు. గతేడాది మార్చిలో ఐక్యూ జడ్6 (iQoo Z6) ఆవిష్కరించారు. ఇందులో 4జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ఫోన్ ధర రూ.15,499గా నిర్ణయించారు. క్రొమాటిక్ బ్లూ, డైనమో బ్లాక్రంగుల్లో లభ్యమైంది.