iQoo Neo 7 Pro 5G | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో సబ్ బ్రాండ్.. ఐక్యూ.. తన ఐక్యూ నియో 7ప్రో 5జీ (iQoo Neo 7 Pro 5G) ఫోన్.. త్వరలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. న్యూ ఆరెంజ్ కలర్ (new orange colour)లో మార్కెట్లోకి రానున్నది. రెక్టాంగులర్ షేప్డ్ రేర్ కెమెరా మాడ్యుల్లో వస్తుంది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ఎస్వోసీ చిప్ సెట్ తో అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ విత్ 120 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో మార్కెట్లోకి వస్తుందని తెలుస్తున్నది. గత నెలలోనే చైనా మార్కెట్లో ఈ ఫోన్ ఆవిష్కరించారు. ఐక్యూ ఇండియా సీఈఓ నిపుణ్ మార్య సోమవారం మరోమారు తన ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ఐక్యూ నియో 7ప్రో 5జీ ఫోన్ ఆవిష్కరణ గురించి టీజ్ చేశారు. ఐక్యూ నియో 7 5జీ, ఐక్యూ నియో 8 డిజైన్ మాదిరిగానే ఐక్యూ నియో 7 ప్రో ఉంటుందని భావిస్తున్నారు.
భారత్ మార్కెట్లో ఐక్యూ నియో 7ప్రో 5జీ (iQoo Neo 7 Pro 5G) ఫోన్ ధర రూ.38 వేల నుంచి రూ.42 వేల మధ్య ఉండొచ్చునని తెలుస్తున్నది. 16 జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్‌గా మార్కెట్లోకి అందుబాటులోకి రావచ్చు. ఐక్యూ నియో 7 ప్రో 5జీ ఫోన్ 6.78-అంగుళాల 1.5కే ఓలెడ్ డిస్ ప్లే విత్ 144 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 1300 నిట్స్ పీక్ బ్రైట్ నెస్‌తో అందుబాటులోకి వస్తున్నది. ఒక్టాకోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ఎస్వోసీ చిప్ సెట్ విత్ ఎల్పీడీడీఆర్5 రామ్ అండ్ యూఎఫ్ఎస్ 3.1 ఇన్ బిల్ట్ స్టోరేజీ ఆప్షన్ కలిగి ఉంటుందని భావిస్తున్నారు.
ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్‌తో ఐక్యూ నియో 7 ప్రో 5జీ ఫోన్ (iQoo Neo 7 Pro 5G) వస్తున్నది. 50-మెగా పిక్సెల్స్ ప్రైమరీ శాంసంగ్ ఐఎస్ఓసీఈఎల్ఎల్ జీఎన్5 సెన్సర్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టేబిలైజేషన్ (ఓఐఎస్) సపోర్ట్, 2-మెగా పిక్సెల్ మాక్రో డెప్త్ సెన్సర్, సెల్ఫీల కోసం 16-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటుంది.