iQoo Neo 7 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఐక్యూ (iQoo) .. తన ఐక్యూ నియో7 5జీ (iQoo Neo 7 5G) ఫోన్‌పై కీలక నిర్ణయం తీసుకున్నది. గత ఫిబ్రవరిలో దేశీయ మార్కెట్లో ఈ ఫోన్ ఆవిష్కరించిన ఐక్యూ (iQoo) భారీగా ధర తగ్గించింది. 120వాట్ల వైర్డ్ ఫ్లాష్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 8200 ఎస్వోసీ చిప్సెట్తో వస్తున్న ఫోన్ రూ.27,999/ 31,999లకు లభిస్తుంది.
ఫిబ్రవరిలో లాంచ్ చేసినప్పుడు ఐక్యూ నియో7 5జీ (iQoo Neo 7 5G) ఫోన్ 8జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.29,999, 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.33,999లకు అందుబాటులో ఉంటుంది. అంటే రెండు వేరియంట్లపైనా రూ.2000 చొప్పున డిస్కౌంట్ ప్రకటించింది.
ఐక్యూ నియో7 5జీ (iQoo Neo 7 5G) ఫోన్ ఫ్రాస్ట్ బ్లూ, ఇంటర్ స్టెల్లార్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. కంపెనీ అధికారిక వెబ్సైట్, ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌లో అప్డేటెడ్ ధరలకు లభిస్తాయి.
ఐక్యూ నియో7 5జీ (iQoo Neo 7 5G) ఫోన్ 6.78-అంగుళాల ఫుల్ హెచ్డీ + (2400×1080 పిక్సెల్స్) అమోలెడ్ డిస్ ప్లే విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 300 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ కలిగి ఉంటుంది. 1300 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ ఉంటుంది. 4 ఎన్ఎం ఒక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 8200 ఎస్వోసీ చిప్ సెట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 బేస్డ్ ఫన్ టచ్ ఓఎస్ 13 వర్షన్‌పై పని చేస్తుంది.
64-మెగా పిక్సెల్ మెయిన్ సెన్సర్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్), 2-మెగా పిక్సెల్ సెన్సర్ విత్ మాక్రో లెన్స్, 2-మెగా పిక్సెల్ డెప్త్ సెన్సర్ తో కూడిన ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. సెల్ఫీలూ, వీడియో కాల్స్ కోసం 16-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరాతో వస్తున్నది.
ఐక్యూ నియో7 5జీ (iQoo Neo 7 5G) ఫోన్ 120 వాట్ల వైర్డ్ ఫ్లాష్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తున్నది. కేవలం పది నిమిషాల్లో 50 శాతం బ్యాటరీ రీచార్జి అవుతుంది. 5జీ, వై-ఫై, బ్లూటూత్, ఓటీజీ, ఎన్ఎఫ్సీ, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ ఉంటుంది. సెక్యూరిటీ కోసం ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది.