iQoo 12 | చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో సబ్ బ్రాండ్ ‘ఐక్యూ (iQoo) భారత్ మార్కెట్లోకి తన ఐక్యూ12 సిరీస్ (iQoo) ఫోన్లను త్వరలో ఆవిష్కరించనున్నది. వచ్చేనెల ఏడో తేదీన ఐక్యూ12 (iQoo12), ఐక్యూ 12 ప్రో (iQoo 12 Pro) ఫోన్లను ఆవిష్కరిస్తుందని సమాచారం. ఈ ఫోన్లు మూడు వేర్వేరు షేడ్లలో వస్తాయని తెలుస్తోంది.
ఐక్యూ 12 (iQoo 12) ఫోన్ 120 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 4880 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ, ఐక్యూ 12 ప్రో (iQ00 12 Pro) ఫోన్ 120 వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ల వైర్ లెస్ చార్జింగ్ మద్దతుతో 4980 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తాయని సమాచారం. స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 ఎస్వోసీ చిప్ సెట్ కలిగి ఉంటుందని భావిస్తున్నారు. బ్లాక్, రెడ్, వైట్ కలర్ ఆప్షన్లలో లభిస్తాయి ఐక్యూ12 (iQoo 12), ఐక్యూ 12 ప్రో (iQoo12 Pro) ఫోన్లు.
ఐక్యూ12 (iQoo 12) సిరీస్ ఫోన్లు 24 జీబీ ర్యామ్ విత్ ఒక టిగా బైట్ స్టోరేజీ తో వస్తాయని తెలుస్తోంది. ఈ ఫోన్లు ఆండ్రాయిడ్ 14 వర్షన్‌పై పని చేస్తాయని అంటున్నారు. శాంసంగ్ ఈ7 అమోలెడ్ డిస్ ప్లే విత్ 2కే రిజొల్యూషన్, 144 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ కలిగి ఉంటాయి.
ఐక్యూ 12 సిరీస్ ఫోన్లలో ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ ఉంటుంది. 50-మెగా పిక్సెల్ ఓమ్నీ విజన్ ఓవీ50హెచ్ సెన్సర్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్), 50-మెగా పిక్సెల్ శాంసంగ్ ఐఎస్ఓసీఈఎల్ఎల్ జేఎన్1 సెన్సర్ విత్ ఆల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 64 -మెగా పిక్సెల్ ఓవీ64బీ టెలిఫొటో సెన్సర్ విత్ 3ఎక్స్ జూమ్ అండ్ ఓఐఎస్ సపోర్ట్ కలిగి ఉంటాయి.