హైదరాబాద్, ఆగస్టు 29 : హైదరాబాద్ కేంద్రంగా డయాల్సిస్ క్లినికల్ నిర్వహణ సంస్థ నెఫ్రోప్లస్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ కావడానికి సిద్ధమైంది. ఇందుకు సంబంధించి గత నెలలో స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీకి దరకాస్తు చేసుకోగా, ప్రస్తుతం గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈక్విటీ షేర్లను జారీ చేయడంతోపాటు ఆఫర్ ఫర్ సేల్ రూట్లో షేర్లను విక్రయించడం ద్వారా గరిష్ఠంగా రూ.353.4 కోట్ల నిధులను సేకరించాలనుకుంటుంది.
ఇలా సేకరించిన నిధులను దేశీయ, అంతర్జాతీయ వ్యాపార విస్తరణకోసం వినియోగించనున్నట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం సంస్థ దేశవ్యాప్తంగా 21 రాష్ర్టాలు, నాలుగు కేంద్ర పాలిత ప్రాంతాల్లో 269 నగరాల్లో డయాల్సిస్ సెంటర్లను నెలకొల్పింది.