iPhone 16E | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20 : ఐఫోన్ సిరీస్ ఫోన్లు భారత్‌లోనే తయారవుతున్నాయి. ఇప్పటికే పలు ఫోన్లు ఉత్పత్తి అవుతుండగా.. తాజాగా 16ఈ ఫోన్ కూడా అసెంబ్లింగ్ అవుతున్నది. చెన్నై ప్లాంట్‌లో తయారవుతున్న ఈ ఫోన్ భారత్‌తోపాటు ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నది. భారత్‌లో ఈ ఫోన్ ఈ నెల 28 నుంచి అందుబాటులోకి రాబోతున్నది. ఈ ఫోన్ కావాలనుకునేవారు ఈ శుక్రవారం నుంచి ముందస్తు బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది.