iPhone Offers | మీరు ఆపిల్ ఐ-ఫోన్ (Apple iPhone) సొంతం చేసుకోవాలని తలపోస్తున్నారా..? కొన్ని నెలలుగా ఐ-ఫోన్ 14, ఐ-ఫోన్ 13, ఐ-ఫోన్ 15 స్మార్ట్ ఫోన్లపై కొన్ని నెలలుగా ఆపిల్ పలు రకాల ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటించింది. ఈ డిస్కౌంట్లు, ఆఫర్లు ఎంతో ఆకర్షణీయంగానూ ఉన్నాయి. రెగ్యులర్ ఫోన్ ధరతో పోలిస్తే రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకూ డిస్కౌంట్ లభిస్తోంది. త్వరలో ఐ-ఫోన్ 16 సిరీస్ ఫోన్లు మార్కెట్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో 2023, అంతకంటే పాత మోడల్ ఫోన్లపై డిస్కౌంట్లను స్మార్ట్ ఫోన్ ప్రేమికులు సొమ్ము చేసుకోవచ్చు. అయితే, పూర్తి స్థాయిలో డిస్కౌంట్లు అందుకోవాలంటే కొంతకాలం వేచి ఉండాల్సి రావచ్చు.
ఫ్లిప్ కార్ట్ తోపాటు బ్యాంకు ఆఫర్లతో కలుపుకుని ఐ-ఫోన్ 15 ధర రూ.79,900 నుంచి రూ.63 వేలకు దిగి వచ్చింది. గత వారం రూ.44,600లకే అందుబాటులో ఉంది. ఇక గత నెలలో ఐ-ఫోన్ 14 ప్లస్ ఫోన్ బ్యాంకు ఆఫర్లతో కలుపుకుని రూ.54,999లకు లభించింది. దీనికి తోడు స్మార్ట్ ఫోన్ల ఉపకరణాలపై దిగుమతి సుంకం తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో ఐ-ఫోన్ 15 ప్రో మ్యాక్స్, ఐఫోన్ 15 ఇతర ఐ-ఫోన్లపై రూ.6,000 వరకూ ధర తగ్గించింది ఆపిల్.
యూనియన్ బడ్జెట్ లో దిగుమతి సుంకం 20 నుంచి 15 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే. తదనుగుణంగా ఆపిల్ తన ఐ-ఫోన్లపై 3-4 శాతం ధరలు తగ్గించింది. దీంతో ఐ-ఫోన్ 13 ఫోన్ రూ.59,900 నుంచి రూ.57,600, ఐ-పోన్ 14 రూ.69,900 నుంచి రూ.69,600, ఐ-ఫోన్ 14 ప్లస్ రూ.79,900 నుంచి రూ.79,600, ఐఫోన్ 15 ఫోన్ రూ.79,900 నుంచి రూ.79,600, ఐఫోన్ 15 ప్లస్ ఫోన్ రూ.89,900 నుంచి రూ.89,600లకు దిగి వచ్చాయి.
ఇక ఐ-ఫోన్ 15 ప్రో ఫోన్ ధర రూ.1,34,900 నుంచి రూ.1,29,800 (రూ.5,100 ఆఫర్), ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ధర రూ.1,59,900 నుంచి రూ.1,54,000 (రూ.5,900)లకు దిగి వచ్చాయి. వీటితోపాటు బ్యాంకు ఆఫర్లు, ఈకామర్స్ ప్లాట్ ఫామ్స్ డిస్కౌంట్లు అదనం.
Maruti Suzuki Ertiga | ఎంపీవీ కార్లకు గిరాకీ.. మారుతి సుజుకి ఎర్టిగా యమ పాపులర్..!
BSA Gold Star 650 | 15న భారత్ మార్కెట్లో బీఎస్ఏ గోల్డ్ స్టార్ 650 బైక్ లాంచింగ్.. ఇవీ డీటెయిల్స్..!
Realme C63 5G | 32-ఎంపీ ఏఐ ఫీచర్లతో రియల్మీ నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్.. ఇవీ డీటెయిల్స్..!