ICICI Bank | మీరు విహార యాత్రలకు వెళ్లాలని తలపోస్తున్నారా.. ఎలక్ట్రానిక్ పరికరాలు కొనుగోలు చేయాలని భావిస్తున్నారా.. లేదా ఏదైనా శుభకార్యానికి బంగారం కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా.. మీకు ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ ‘సమ్మర్ బోనంజా ఆఫర్ (Summer Bonanza Offer)’ అద్భుతమైన ఆఫర్లు అందుబాటులోకి తెచ్చింది. బ్యాంక్ ఖాతాదారులైతే పలు రకాల ఆప్షన్ల కింద బెనిఫిట్లు పొందొచ్చు.
ఆన్లైన్ షాపింగ్ మొదలు ఎలక్ట్రానిక్ గూడ్స్, జ్యువెల్లరీ కొనుగోళ్లు, విహార యాత్రలకు పేమెంట్స్.. అన్నింటిలోనూ ఆకర్షణీయమైన బెనిఫిట్లు అందిస్తున్నది. ఐసీఐసీఐ క్రెడిట్/ డెబిట్ కార్డ్ కల వారు ఈ ఆఫర్లు పొందొచ్చు. నెట్‌బ్యాంకింగ్ పేమెంట్‌తోపాటు వస్తువుల కొనుగోళ్లకు ఈఎంఐ ఆప్షన్ ఎంచుకున్నా ఈ బెనిఫిట్లు పొందొచ్చునని ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. ఆపిల్, ఎల్జీ, సోనీ వంటి బ్రాండ్ వస్తువుల కొనుగోళ్లు జరిపినా ఈ ఆఫర్లు పొందొచ్చు. ఆపిల్ ఐ-ఫోన్ 14 కొనుగోలు చేసిన వారు బిల్లు ఈఎంఐలు మార్చుకోవచ్చు. అలా మార్చుకున్న ఈఎంఐలపై వడ్డీ చెల్లింపు మాఫీ ఉంటుంది.
ప్రముఖ చైనా ఎలక్ట్రానిక్ సంస్థలు షియోమీ, వివో, వన్ ప్లస్ కంపెనీల ఉత్పత్తులపై రూ.8000 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. క్రోమా రిటైల్ స్టోర్ / వెబ్ సైట్ నుంచి కొనుగోలు చేసిన వారికి రూ.5000 ధర తగ్గుతుంది. ఎల్జీ, సోనీ, శాంసంగ్, డెల్, హయ్యర్ వంటి ప్రముఖ బాండ్ ప్రొడక్టులపై 22.5 శాతం డిస్కౌంట్ అందుకోవచ్చు.
మేక్ మై ట్రిప్, ఈజీ మై ట్రిప్, యాత్ర, పేటీఎం ట్రావెల్ వంటి పేరొందిన ఆన్లైన్ ట్రావెల్ ప్లాట్‌ఫామ్స్ విమాన ప్రయాణ టికెట్ కొనుగోలుపై 15 శాతం, పేటీఎం ట్రావెల్ యాప్ ద్వారా బస్సు ప్రయాణానికి టికెట్ బుక్ చేసుకుంటే 25 శాతం డిస్కౌంట్ అందిస్తున్నది ఐసీఐసీఐ బ్యాంక్. బ్యాంక్ ఖాతాదారులు ఏ ప్రాంతంలోనైనా ఏ హోటల్ గది బుక్ చేసుకున్నా, విల్లా బుక్ చేసుకున్నా బిల్లుపై 25 శాతం తగ్గింపు ఆఫర్ చేస్తున్నది.
ఇక జొమాటో, స్విగ్గీ తదితర ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్‌ల నుంచి ఫుడ్ బుక్ చేసుకుంటే 20 శాతం తగ్గింపు అందుబాటులో ఉంది. గిఫ్ట్‌లపై 20 శాతం డిస్కౌంట్లతోపాటు కొన్ని బ్రాండ్ల వస్తువులను ఆన్లైన్లో కొనుగోలు చేసిన వారికి భారీగా డిస్కౌంట్ అందిస్తున్నది. జొమాటో & ఈజీ డైనర్ యాప్ ద్వారా రెస్టారెంట్ డైనింగ్ బిల్లుపై 15 శాతం, స్విగ్గీ, జొమాటో ప్లాట్‌ఫామ్‌ల నుంచి ఫుడ్ ఆర్డర్ పైన 20 శాతం రాయితీ లభిస్తుంది.
ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం, అందం కాపాడుకోవాలని భావిస్తారు. అటువంటి వారికి కూడా ఐసీఐసీఐ బ్యాంక్ ఆఫర్లు అందుబాటులోకి తెచ్చింది. ఉదాహరణకు టాటా క్లిక్ పాలెట్, హెల్త్ కార్ట్ వంటి వెబ్ సైట్లు, యాప్‌ల 20 శాతం రాయితీ అందిస్తున్నది.