హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను మంగళవారం యునైటెడ్ ఇవాంజిలిస్ట్స్ అండ్ క్రిస్టియన్స్ అసోసియేషన్ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ రాచపూడి ప్రదీప్ శ్యామ్, ప్రధాన కార్యదర్శి కల్లోజి రవికుమార్ కలిశారు. క్రిస్మస్ వేడుకలకు మం త్రిని ఆహ్వానించారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
మహాసభల పోస్టర్ ఆవిష్కరణ
‘నేషనల్ ప్లాట్ ఫామ్ రైట్స్ అఫ్ ది డిసెబుల్’ అఖిలభారత 3వ మహాసభల పోస్టర్‌ను మంత్రి కొప్పుల ఆవిషరించారు. వచ్చేనెల 26, 27, 28 తేదీల్లో హైదరాబాద్‌లో ఈ మహాసభలు జరుగనున్నాయి. కార్యక్రమంలో వికలాంగుల హకుల జాతీయ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్, కార్యదర్శి అడివయ్య, వెంకటేశ్, నాయకులు రాజు, సత్యనారాయణ, ఉష పాల్గొన్నారు.