హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): భవిష్యత్తును శాసించే టెక్నాలజీని ప్రపంచానికి పరిచయం చేసేలా హైదరాబాద్లో అంతర్జాతీయ సదస్సు జరగబోతున్నది. వచ్చే నెల 21 నుంచి హెచ్ఐఐసీ వేదికగా నాస్కాం..ఫ్యూచర్ టెక్ లెన్స్-2023 సదస్సును నిర్వహించబోతున్నది.
టెక్నాలజీ రంగంలో వేగంగా వస్తున్న మార్పులు, ఆయా రంగాలపై వాటి ప్రభావంపై చర్చించేందుకు నిపుణులంతా ఒకే విదేకపైకి రాబోతున్నారు. కృత్రిమ మేధస్సు, స్పేస్ టెక్, ఫిన్ టెక్, రోబోటిక్స్, ఇన్నోవేషన్, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి కీలకమైన అంశాలపై చర్చించనున్నారు.