ముంబై, అక్టోబర్ 21: డిపాజిట్లను ఆకట్టుకోవడానికి వడ్డీరేట్లను పెంచుతున్న బ్యాంక్లు తాజాగా ఈ జాబితాలోకి దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) చేరింది. ఈ నెల 22 నుంచి అమలులోకి వచ్చేలా అన్ని రకాల డిపాజిట్లపై వడ్డీరేటును 80 బేసిస్ పాయింట్ల వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. దీంతో రూ.2 కోట్ల లోపు 211 రోజుల నుంచి ఏడాది లోపు కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై వడ్డీరేటును 80 బేసిస్ పాయింట్లు పెంచడంతో వడ్డీరేటు 4.70 శాతం నుంచి 5.50 శాతానికి చేరుకున్నది. 7 రోజుల నుంచి 45 రోజుల లోపు డిపాజిట్లపై వడ్డీరేటును 0.25-0.60 శాతం లోపు సవరించడంతో రేటు 3 శాతంగా నమోదైంది.