హైదరాబాద్, మార్చి 10(నమస్తే తెలంగాణ): మేధో సంపత్తి జ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటిదని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం(ఎంసీఆర్హెచ్ఆర్డీ) డైరెక్టర్ జనరల్ శశాంక్ గోయల్ అన్నారు. అంతేకాకుండా ఆవిష్కర్తలు, స్టార్టప్‌లు, వ్యాపారాలు పీసీటీ మార్గంలో పేటెంట్లను దాఖలు చేయడంవల్ల కలిగే వ్యూహాత్మక ప్రయోజనాలను అర్థం చేసుకోడానికి సహాయ పడుతుందని ఆయన పేర్కొన్నారు.
వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్, ట్రేడ్ మార్క్స్(సీజీపీడీటీఎం), డబ్ల్యూఐపీఓ) సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం ఎంసీఆర్హెచ్ఆర్డీలో సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన గోయల్ మాట్లాడుతూ.. మేకిన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్, స్టార్టప్ ఇండియాలు ప్రపంచ ఆవిష్కరణల కేంద్రంగా మారాయన్నారు.