హైదరాబాద్, సెప్టెంబర్ 24: విద్యార్థులకు కృత్రిమ మేధస్సు ఆధారిత గేమింగ్ జోన్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది ఇంటెల్ ఇండియా. విశాల్ పెరిఫెరల్స్తో కలిసి ఏర్పాటు చేసిన ఈ గేమింగ్ జోన్లో విద్యార్థులు ఉచితంగా వినియోగించుకోవచ్చును.
నగరంలో ఏర్పాటు చేసిన తొలి గేమింగ్ జోన్ ఇదే కావడం విశేషం. విద్యార్థులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని నిర్వహకులు తెలిపారు. ఇందులో అత్యాధునిక స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ కంప్యూటింగ్ టూల్స్‌తోపాటు ప్రోగ్రామింగ్, ఏఐ డెవలప్మెంట్, గేమింగ్ రంగాలకు చెందిన విద్యార్థులు తమ నైపుణ్యాలను పెంచుకునేందుకు దోహదపడుతుందన్నారు.