Housing Market | రియల్ ఎస్టేట్ రంగంలో ప్రత్యేకించి ఇండ్ల నిర్మాణ పరిశ్రమలో సంస్థాగత పెట్టుబడులు పెరుగుతున్నాయి. 2023తో పోలిస్తే రియల్ ఎస్టేట్ రంగలో వృద్ధిరేటు 46 శాతం పెరిగిపోయింది. నివాస ఆస్తులకు గల డిమాండ్‌ను ఇన్వెస్టర్లు సొమ్ము చేసుకోవాలని భావిస్తున్నారని ప్రముఖ రియాల్టీ కన్సల్టెన్సీ సంస్థ కొల్లియర్స్ ఙండియా తెలిపారు. 2023లో ఇండ్ల నిర్మాణ పరిశ్రమలో సంస్థాగత పెట్టుబడులు 786.9మిలియన్ డాలర్లు. దీంతో పోలిస్తే 2024లో భారత రియల్ ఎస్టేట్ రంగంలో సంస్థాగత ఇన్వెస్టర్ల వాటా 22 శాతం వృద్ధి చెంది 6.5 బిలియన్ డాలర్లకు చేరుకున్నది. 2023లో 4.3 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఇన్వెస్టర్లు పెట్టారు. 2024లో మొత్తం పెట్టుబడులు 66 శాతం పెరిగాయి.
ఇండస్ట్రీయల్ అండ్ వేర్ హౌసింగ్ సెగ్మెంట్లో 2024లో సంస్థాగత ఇన్వెస్టర్లు గరిష్టంగా 2.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టారు. 2023లో 877.6 మిలియన్ డాలర్ల పెట్టుబడులు మాత్రమే వచ్చాయి. ఆఫీస్ సెగ్మెంట్లో మాత్రం 23శాతం పెట్టుబడులు తగ్గాయి. గత ఐదేండ్లుగా రియల్ ఎస్టేట్ రంగంలోని అన్ని సెగ్మెంట్లలో డిమాండ్ ఎక్కువగా ఉండటంతో దేశీయ, అంతర్జాతీయ సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడులు పుంజుకున్నాయి. అంతర్జాతీయ స్థాయిలోనే రియల్ ఎస్టేట్‌లో భారత్ మొదటి స్థానంలో నిలిచింది.