హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ) : నగరంలో ఏఎక్స్ ప్రీమియం ప్రాపర్టీస్ ‘దుబాయ్ ప్రాపర్టీ ఎక్స్పో 2.0’ను నిర్వహించింది. హైదరాబాద్లోని ఐటీసీ కోహినూర్ వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఏఎక్స్ ప్రాపర్టీస్ సేల్స్ డైరెక్టర్ సమీక్ష దావులూరి, డమక్ బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ అనిల్ మాట్లాడుతూ.. మన దేశ పెట్టుబడిదారులకు దుబాయ్లో పన్ను రహిత వాతావరణం, అధిక రాబడి, అనుకూలమైన విధానాలను కల్పిస్తున్నట్టు తెలిపారు. ఈ ఎక్స్పో ద్వారా హైదరాబాద్ పెట్టుబడిదారులలో దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం యొక్క ప్రయోజనాల గురించి అవగాహన కల్పిస్తున్నట్టు తెలిపారు. దుబాయ్లో పెట్టుబడులు పెట్టే తెలుగు వారికి అన్నిరకాల ప్రయోజనాలు కల్పిస్తామని, ముఖ్యంగా పన్నుల రాయితీ కల్పిస్తామన్నారు.