Infosys | ఇన్ఫోసిస్‌లో కొత్తగా 50వేల కొలువులు.. లాభాలు అంచనాల్లోపే!
Infosys | గతేడాది ఇన్ఫోసిస్‌లో 85 వేల ఫ్రెషర్స్‌కు కొలువులొస్తే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మరో 50 వేల మందిని నియమించుకోనుంది.
Infosys | గత ఆర్థిక సంవత్సరంలో 85 వేల మంది ఫ్రెషర్లను నియమించుకున్న ఇన్ఫోసిస్.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 50 వేల మంది నియామకానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. డిసెంబర్ త్రైమాసికంతో పోలిస్తే, మార్చి త్రైమాసికంలో అట్రిక్షన్ 27.7 శాతం పెరిగిందని ఇన్ఫోసిస్ తెలిపింది. డిసెంబర్ త్రైమాసికంలో 25.5 శాతం మంది ఉద్యోగులు అట్రిక్షన్ బాట పట్టారని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం ఫలితాలను ఇన్ఫోసిస్ బుధవారం వెల్లడించింది. అయినప్పటికీ, చివరి త్రైమాసికంలో వాస్తవంగా అట్రిక్షన్ రేటు తగ్గుముఖం పట్టిందని వివరించింది.
వర్క్ ఫ్రం హోం సంస్కృతికి ఐటీ సంస్థలు స్వస్తి పలుకుతుండటంతో సాఫ్ట్వేర్, ఐటీ సర్వీసులకు డిమాండ్ నెమ్మదిస్తున్నదన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫోసిస్ రెవెన్యూ గెడైన్స్ 13-15 %గానూ, నిర్వహణ లాభాలు 21-23 శాతంగానూ ఉంటాయని అంచనా వేసింది.
మార్చి త్రైమాసికంలో ఇన్ఫోసిస్ నికర లాభం 12 శాతం పెరిగి రూ.5,686 కోట్ల వద్ద నిలిచింది. విశ్లేషకులు రూ.6000 కోట్ల నికర లాభాలు వస్తాయని అంచనా వేశారు. జనవరి-మార్చి త్రైమాసికంలో సంస్థ ఆదాయం 23 శాతం పెరిగి రూ.32,276 కోట్లకు చేరుకున్నది.
రష్యాలో ఇన్ఫీ సేవలు బంద్
ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాలో తమ సేవలను నిలిపివేయాలని ఇన్ఫోసిస్ తెలిపింది. దీనికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్లు పేర్కొన్నది. రష్యా నుంచి తమ కార్యకలాపాలను ఇతర ప్రాంతాలకు మళ్లిస్తున్నట్లు వివరించింది. ఒరాకిల్, ఎన్సీపీ, నొకియా తదితర సంస్థలు రష్యాలో కార్యకలాపాలు నిలిపివేసిన సంగతి తెలిసిందే. బోరిస్ జాన్సన్ వారసుడిగా.. బ్రిటన్ ప్రధాని అభ్యర్థిగా ఆ దేశ ఆర్థిక మంత్రి రిషి సునాక్ పేరు ముందుకొచ్చినా.. రష్యాలో ఇన్ఫోసిస్ సేవల వల్లే వెనుకబడ్డారని వార్తలొచ్చాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

