Vishal Sikka | ఇండో అమెరికన్ పారిశ్రామికవేత్త, ఇన్ఫోసిస్ మాజీ సీఈఓ విశాల్ సిక్కా శనివారం ప్రధాని నరేంద్రమోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీతో దిగిన ఫోటోను సోషల్ మీడి యావేదిక ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వల్ల భారత్ మీద చూపే ప్రభావంపై ప్రధాని మోదీతో చర్చించినట్లు చెప్పారు. ‘ప్రధాని నరేంద్రమోదీతో భేటీ కావడం గర్వకారణం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దానివల్ల భారత్‌పై ప్రభావంపై మోదీ విస్తృత స్థాయి చర్చలు జరిపాం. ఈ భేటీ తర్వాత టెక్నాలజీపై ప్రధాని మోదీకి గల అసాధారణ పరిజ్ఞానం నన్ను అబ్బుర పరిచింది. ప్రజాస్వామ్య విలువలతోపాటు దాన్ని ఉపయోగంతో ప్రతి ఒక్కరి అభ్యున్నతికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఎలా ఉపయోగించాలో తెలుసుకున్నాం’ అని ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు.
విశాల్ సిక్కా గతంలో 2014 నుంచి 2017 వరకూ ఇన్ఫోసిస్ సీఈఓ కం మేనేజింగ్ డైరెక్టర్‌గా పని చేశారు. ఇన్ఫోసిస్ సీఈఓగా నియమితులైన తొలి నాన్ ఫౌండర్ విశాల్ సిక్కా. అయితే కంపెనీ బోర్డు డైరెక్టర్లు, ఫౌండర్లకు మధ్య విభేదాలు తలెత్తడంతో 2017లో రాజీనామా చేశారు. ఆయన తన సొంత ఏఐ బేస్డ్ స్టార్టప్ వైనాయి సిస్టమ్స్‌తోపాటు పలు వెంచర్లలో భాగస్వామిగా ఉన్నారు. 2002 నుంచి 2014 ఆగస్టు వరకూ జర్మనీ టెక్నాలజీ మేజర్ ‘ఎస్ఏపీ’లో సుదీర్ఘకాలం పని చేశారు. 12 ఏండ్ల కాలంలో సంస్థ సీటీవో, ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యుడిగా ఉన్నారు.
It was a privilege to meet the Hon. Prime Minister Sh. @narendramodi for a detailed and wide-ranging discussion on AI, its impact on India and several imperatives for the time ahead. I left the meeting both inspired and humbled by his extraordinary grasp of technology’s impact… pic.twitter.com/yZpBsyKI7G
— Vishal Sikka (@vsikka) January 4, 2025
విశాల్ సిక్కా చేసిన ట్వీట్‌ను ప్రధాని మోదీ రీ ట్వీట్ చేశారు. తమ ఇద్దరి భేటీ పరస్పర అవగాహన పెంచుకోవడానికి ఉపకరించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)లో నాయకత్వం వహించేందుకు భారత్ కట్టుబడి ఉంది. యువత కోసం ఇన్నోవేషన్, అవకాశాల కల్పపై దృష్టి పెడతామని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
It was an insightful interaction indeed. India is committed to taking the lead in AI, with a focus on innovation and creating opportunities for the youth. https://t.co/s0Ok9AE09A
— Narendra Modi (@narendramodi) January 4, 2025