Infosys Narayana Murthy | సాప్ట్వేర్ ఇంజనీర్ కావడం సులభమే కానీ వ్యాపారవేత్తగా ఎదగడం కష్టం : నారాయణమూర్తి
తన వ్యాఖ్యలతో ఎప్పటికప్పుడు వార్తల్లో నిలిచే ఇన్ఫోసిస్ సహ వ్యవస్ధాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి (Infosys Narayana Murthy) తాజాగా టెకీలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
న్యూఢిల్లీ : తన వ్యాఖ్యలతో ఎప్పటికప్పుడు వార్తల్లో నిలిచే ఇన్ఫోసిస్ సహ వ్యవస్ధాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి (Infosys Narayana Murthy) తాజాగా టెకీలపై కీలక వ్యాఖ్యలు చేశారు. యువత వారంలో 70 గంటల పాటు పనిచేయాలని ఆయన ఇటీవల చేసిన వ్యాఖ్యలపై హాట్ డిబేట్ సాగింది. ఇక తాజాగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ లేదా ఫైనాన్షియల్ అనలిస్ట్ కావడం చాలా తేలికని, స్టార్టప్‌ను నడపడం, వ్యాపారవేత్తగా మారడం చాలా శ్రమతో కూడుకున్నదని పేర్కొన్నారు.
వ్యాపారాలను నిర్మించేందుకు రిస్క్ తీసుకునే యువ వ్యాపారవేత్తలకు బాసటగా నిలిచేలా సమాజంలో విస్తృతమైన మార్పు రావాలని ఆయన ఆకాంక్షించారు. దశాబ్ధం కిందట ఊహకు సైతం అందని రీతిలో వినూత్న ఐడియాలతో ముందుకొస్తున్న ఔత్సాహిత వ్యాపారవేత్తల సంఖ్య పెరగడం చూశామని అన్నారు. ప్రస్తుత యువతరం ఎంతో ఆత్మవిశ్వాసంతో అంకితభావంతో ఉందని చెప్పారు.
సంక్లిష్ట సమస్యలను ఎదుర్కొనేందుకు నేటితరం వ్యాపారవేత్తలు ఉత్సుకతతో ఉన్నారని అన్నారు. వ్యాపారంలో అడుగుపెట్టే యువతకు సమాజపరంగా అండగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పారు. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, ఫైనాన్షియల్ అనాలిసిస్ వంటి కెరీర్లు స్ధిరత్వాన్ని అందిస్తాయని అయితే వ్యాపారం అందుకు భిన్నమైనదని ఇక్కడ సక్సెస్‌కు ఎలాంటి గ్యారంటీ లేదని అన్నారు. వినూత్న ఒరవడి, పురోగతికి బాటలు వేసే వ్యాపారరంగం కొంత రిస్క్‌తో కూడుకున్నదని నారాయణమూర్తి పేర్కొన్నారు.
Read More :
Rashmika Mandanna | రష్మిక మందన్నా డీప్‌ఫేక్ వీడియోపై స్పందించిన మాజీ లవర్
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Uttarakhand | సీఎం సార్..నా భార్య అవినీతి లెక్క తేల్చండి..! ఉత్తరాఖండ్ మహిళా మంత్రిపై భర్త ఆరోపణలు
RTC Elections | ఆర్టీసీ ఎన్నికల ఫలితాలు తారుమారు?.. కాంగ్రెస్ అనుబంధ సంఘానికి కట్టబెట్టే యత్నం
Delhi Police | పోలీసుల దాష్టీకాలపై కదం తొక్కిన మహిళలు.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
Gold price | బంగారం మళ్లీ ఆల్‌టైమ్ హై?.. వచ్చే రెండేండ్లలో చేరవచ్చన్న అంచనాలు
Nitish Kumar | నితీశ్ కోసం తొమ్మిది హత్యలు చేశా.. జేడీయూ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

