Small Cap Mutual Funds | ప్రతి ఒక్కరూ తమ కుటుంబ భవిష్యత్ లక్షాల కోసం కొంత మొత్తం వివిధ పొదుపు పథకాల్లో మదుపు చేస్తుంటారు. అటువంటి మదుపు పథకాల్లో మ్యూచువల్ ఫండ్స్.. ఈక్విటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. రిస్క్ ముప్పు ఉన్నా మంచి రిటర్న్స్ ఇస్తాయి ఈక్విటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్స్ . ఇన్వెస్టర్లు స్మాల్ క్యాప్ ఫండ్స్‌కు ప్రాధాన్యం ఇవ్వడంతో గత నెలలో ఈక్విటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్స్‌లోకి రూ.19,957 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. సెప్టెంబర్ నెల పెట్టుబడులతో పోలిస్తే 42 శాతం ఎక్కువ. సెప్టెంబర్‌లో స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ లో రూ.14,091 కోట్ల పెట్టుబడులు పెట్టారు.
గత రెండు నెలల్లో కంటే అధికంగా ఆగస్టులో రూ. 20,245 కోట్ల పెట్టుబడులు స్మాల్ క్యాప్ సెగ్మెంట్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టారని అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (ఎఎంఎఫ్ఐ) గురువారం తెలిపింది. వరుసగా 32వ నెలలోనూ మ్యూచువల్ ఫండ్స్ లోకి నికరంగా పెట్టుబడులు వచ్చి చేరాయి. అన్ని ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ సెగ్మెంట్లలోకి పెట్టబుడులు భారీగా వచ్చి చేరాయి. స్మాల్ క్యాప్ ఫండ్స్ లో రూ.4495 కోట్లు, థీమాటిక్ ఫండ్స్ లోకి రూ. 3,896 కోట్ల పెట్టుబడులు రావడం గమనార్హం. 44 మ్యూచువల్ ఫండ్స్ నుంచి సెప్టెంబర్ నెలలో రూ.66,192 కోట్ల నిధులు విత్ డ్రా అయితే, గత నెలలో రూ.80,528 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
గత రెండు నెలలుగా ఈక్విటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్స్ నుంచి నిధుల ఉపసంహరణ తర్వాత డెట్ ఫండ్స్ (debt-oriented funds)లోకి గత నెలలో రూ.42,634 కోట్ల పెట్టుబడులు రావడం గమనార్హం. సెప్టెంబర్ నెలలో రూ.1.01 లక్షల కోట్ల పెట్టుబడులు మ్యూచువల్ ఫండ్స్ నుంచి విత్ డ్రా కాగా, ఆగస్టులో రూ. 25,873 కోట్ల పెట్టుబడులను ఇన్వెస్టర్లు ఉపసంహరించుకున్నారు. అక్టోబర్ లో మ్యూచువల్ ఫండ్స్ ఇండస్ట్రీలో పెట్టుబడులు రూ.46.71 లక్షల కోట్లకు చేరుకున్నాయి. అంతకుముందు సెప్టెంబర్‌లో రూ. 46.58 లక్షల కోట్లుగా ఉన్నాయి.