Infinix Zero 30 5G | చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఇన్ఫినిక్స్.. తన ఇన్ఫినిక్స్ జీరో 30 5జీ (Infinix Zero 30 5G) ఫోన్‌ను ఈ నెలాఖరులోగా భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. గత డిసెంబర్లో ఆవిష్కరించిన ఇన్ఫినిక్స్ జీరో 20 5జీ ఫోన్‌కు కొనసాగింపుగా ఇన్ఫినిక్స్ జీరో 30 5జీ (Infinix Zero 30 5G) వస్తోంది. ఇన్ఫినిక్స్ జీరో 30 5జీ తోపాటు ఇన్ఫినిక్స్ జీరో 30 టర్బో 5జీ వేరియంట్ కూడా వస్తుందని వార్తలొచ్చినా.. అధికారికంగా సంస్థ ప్రకటన చేయలేదు.
ఇన్ఫినిక్స్ జీరో 30 5జీ (Infinix Zero 30 5G) ఫోన్ లావెండర్, గోల్డెన్ కలర్ ఆప్షన్స్ విత్ గ్లాస్ బ్యాక్ ప్యానెల్స్‌తో వస్తున్నదని సమాచారం. 60-డిగ్రీ కర్వ్డ్ 10 బిట్ అమోలెడ్ డిస్ ప్లే విత్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ కలిగి ఉంటుంది.
ఇన్ఫినిక్స్ జీరో 20 5జీ (Infinix Zero 30 5G) ఫోన్ మీడియాటెక్ హెలియో జీ99 ఎస్వోసీ చిప్ సెట్, 44 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 4500 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వచ్చింది. ఇన్ఫినిక్స్ జీరో 30 5జీ ఫోన్ కూడా కొన్ని మార్పులతో మార్కెట్లోకి వస్తుందని భావిస్తున్నారు.
ఇన్ఫినిక్స్ జీరో 30 5జీ (Infinix Zero 30 5G) ఫోన్ ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ విత్ 108-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్, 13-మెగా పిక్సెల్ సెన్సర్ విత్ ఆల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2-మెగా పిక్సెల్ పెన్సర్ విత్ క్వాడ్ రేర్ ఫ్లాష్ యూనిట్ కెమెరా ఉంటాయని భావిస్తున్నారు. సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 60-మెగా పిక్సెల్స్ సెన్సర్ కెమెరా ఉంటుంది.
ఇక ఇన్ఫినిక్స్ జీరో 20 5జీ (Infinix Zero 30 5G) ఫోన్ 8జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ధర రూ.15,999 పలికితే, అంతకుముందు రిలీజ్ చేసిన ఇన్ఫినిక్స్ జీటీ 10ప్రో ఫోన్ రూ.19,999 పలికింది. ఇన్ఫినిక్స్ జీటీ 10ప్రో ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8050 ఎస్వోసీ చిప్సెట్తో వచ్చింది. అయితే, ఇన్ఫినిక్స్ జీరో 30 5జీ ఫోన్ ధర ఎంత అన్నది వెల్లడి కావాల్సి ఉంది.