Infinix Smart 8 Pro | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఇన్ఫినిక్స్ (Infinix) తన ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 ప్రో (Infinix Smart 8 Pro) ఫోన్ ఆవిష్కరించింది. 50-మెగా పిక్సెల్ రేర్ కెమెరాతోపాటు 6.6 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ స్క్రీన్ విత్ 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతో వస్తున్నది. 500 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ ఉంటుంది. మీడియా టెక్ హేలియో జీ36 ఎస్వోసీ చిప్సెట్ కలిగి ఉన్న ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 ప్రో ఫోన్ 10వాట్ల చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తున్నది. అయితే ఇంకా ఫోన్ ధర ఎంత అన్నది వెల్లడించలేదు. దీని ధర రూ.7,499 ఉండొచ్చునని భావిస్తున్నారు.
ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 ప్రో (Infinix Smart 8 Pro) ఫోన్ 4జీబీ ర్యామ్ విత్ 64 జీబీ స్టోరేజీ, 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్లుగా లభిస్తుంది. గెలాక్సీ వైట్, రెయిన్ బో బ్లూ, షైనీ గోల్డ్, టింబర్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 ప్రో (Infinix Smart 8 Pro) ఫోన్ ఆండ్రాయిడ్ 13 (గో ఎడిషన్) ఔటాఫ్ బాక్స్ వర్షన్‌పై పని చేస్తుంది. 50 – మెగా పిక్సెల్ రేర్ కెమెరా విత్ ఎఫ్ / 1.85 అపెర్చర్, అన్ స్పెసిఫైడ్ ఏఐ లెన్స్ విత్ ఎఫ్/ 2.0 అపెర్చర్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 8-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటాయి.
8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ ఫోన్లో మైక్రో ఎస్డీ కార్డు సాయంతో రెండు టిగా బైట్ల వరకూ స్టోరేజీ కెపాసిటీ పెంచుకోవచ్చు. 4జీ ఎల్టీఈ, వై-ఫై5, బ్లూటూత్ 5, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, 3.5 ఎంఎం ఆడియో జాక్, గైరో స్కోప్, ఈ-కంపాస్, యాక్సెలరో మీటర్, అంబియెంట్ లైట్ సెన్సర్, ప్రాగ్జిమిటీ సెన్సర్లతో కనెక్టివిటీ ఉంటుంది. బయో మెట్రిక్ అథంటికేషన్ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటది.