Infinix Smart 7 HD | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఇన్ఫినిక్స్.. భారత్ మార్కెట్లోకి చౌక ధరలో శుక్రవారం ఇన్ఫినిక్స్ స్మార్ట్ 7 హెచ్డీ (Infinix Smart 7 HD) ఆవిష్కరించింది. ఈ ఫోన్ 6.6-అంగుళాల ఫుల్ హెచ్డీ + ఐపీఎస్ డిస్ప్లే విత్ 60హెర్డ్జ్ రీఫ్రెష్ రేట్, ఏఐ బ్యాక్డ్ డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ కలిగి ఉంది. ఎంట్రీ లెవెల్ హ్యాండ్ సెట్ మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. దీని బ్యాటరీ 5000 ఎంఏహెచ్ కెపాసిటీ కలిగి ఉంటుంది. ఇన్ఫినిక్స్ స్మార్ట్ 7 హెచ్డీ (Infinix Smart 7 HD) ఫోన్ యూనిసోక్ ఎస్సీ 9863 ఏఐ ఎస్వోసీ చిప్సెట్, 2 జీబీ రామ్ విత్ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ కెపాసిటీతో వస్తున్నది. వచ్చే వారం నుంచి ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో సేల్స్ ప్రారంభం అవుతాయి.
ఇన్ఫినిక్స్ స్మార్ట్ 7 హెచ్డీ (Infinix Smart 7 HD) ఫోన్ రూ.5,999లకు లభిస్తుంది. ఈ ఫోన్ ఇంక్ బ్లాక్, జేడ్ వైట్, సిల్క్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. వచ్చే గురువారం మధ్యాహ్నం 12 గంటలకు సేల్స్ మొదలవవుతాయి. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డుపై ఐదు శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్ పొందొచ్చు. రూ.211 నుంచి ఈఎంఐ ప్రారంభం అవుతుంది.
ఇన్ఫినిక్స్ స్మార్ట్ 7 హెచ్డీ (Infinix Smart 7 HD) ఫోన్ ఆండ్రాయిడ్ 12 (గో ఎడిషన్) బేస్డ్ ఎక్స్ఓఎస్ 12 వర్షన్ పై పని చేస్తుంది. 6.6-అంగుళాల ఫుల్ హెచ్డీ + 720 x 1,612 రిజొల్యూషన్, ఐపీఎస్ డిస్ప్లే విత్ 60 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. 500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. వాటర్ డ్రాప్ స్టైల్ నాచ్ కటౌట్ స్క్రీన్‌తో వస్తున్నది.
ఇన్ఫినిక్స్ స్మార్ట్ 7 హెచ్డీ ఫోన్ ఏఐ బ్యాక్డ్ డ్యుయల్ కెమెరా సెటప్‌తో వస్తున్నది. 8-మెగా పిక్సెల్ మెయిన్ సెన్సర్ అండ్ డ్యుయల్ ఎల్ఈడీ ఫ్లాష్, సెల్ఫీలు, వీడియో చాట్ల కోసం 5-మెగా పిక్సెల్ సెన్సర్ విత్ ఎల్ఈడీ ఫ్లాష్ కెమెరా ఉంటాయి. ఇన్ఫినిక్స్ స్మార్ట్ 7 హెచ్డీ ఫోన్ 64జీబీ స్టోరేజీ కెపాసిటీ కలిగి ఉండగా, మైక్రో ఎస్డీ కార్డ్‌తో ఒక టిగా బైట్ వరకు పెంచుకోవచ్చు.
4జీ ఎల్టీఈ, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, బ్లూ టూత్ 4.2, ఓటీజీ, వై-ఫై కనెక్టివిటీ కలిగి ఉంటుంది. యాంబియెంట్ లైట్ సెన్సర్, ఈ-కంపాస్, గైరోస్కోప్, ప్రాక్సిమిటీ సెన్సర్‌తోపాటు బయోమెట్రిక్ అథంటికేషన్ కోసం ఫింగర్‌ప్రింట్ సెన్సర్ ఫీచర్ జత చేశారు.
5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ వస్తున్నది ఇన్ఫినిక్స్ స్మార్ట్ 7 హెచ్డీ. ఒక్కసారి చార్జి చేస్తే 39 గంటల కాలింగ్ టైం, మ్యూజిక్ ప్లేబ్యాక్ టైం 50 గంటలు, స్టాండ్‌బై మోడ్‌లో ఈ బ్యాటరీ సపోర్ట్‌గా ఉంటుంది. బ్యాటరీ చార్జింగ్ ఐదు శాతం ఉన్నా, ఆల్ట్రా పవర్ సేవింగ్ మోడ్‌లో రెండు గంటల వరకు కాల్స్ చేయొచ్చు.