Infinix Note 30 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఇన్ఫినిక్స్ తన ఇన్ ఫినిక్స్ నోట్ 30 5జీ (Infinix Note 30 5G) ఫోన్ బడ్జెట్ ధరకే భారతీయులకు అందుబాటులోకి తేనున్నది. గ్లోబల్ మార్కెట్లో గత నెలలో ఆవిష్కరించిన ఈ ఫోన్.. ఈ నెల 14న భారత్ మార్కెట్లోకి ఎంటర్ కానున్నది. దీని ధర రూ.15 వేల నుంచి ప్రారంభం అవుతుందని ఇన్ఫినిక్స్ శుక్రవారం ప్రకటించింది.
ఇంటర్ స్టెల్లార్ బ్లూ, మ్యాజిక్ బ్లాక్, సన్ సెట్ గోల్డ్ కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి రానున్నది. బేస్ మోడల్ ధర వెల్లడించినా.. ఎన్ని స్టోరేజీ వేరియంట్లలో లభిస్తుంది, వాటి ధర ఎంత అన్న సంగతి ఇన్ఫినిక్స్ బయట పెట్టలేదు.
6.78-అంగుళాల ఫుల్ హెచ్డీ + (1080×2460 పిక్సెల్స్ రిజొల్యూషన్) ఐపీఎస్ ఎల్టీపీఎస్ ఎల్సీడీ డిస్ ప్లేస్ విత్ టచ్ శాంప్లింగ్ రేట్ 240 హెర్ట్జ్తో వస్తుంది. 580 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో అందుబాటులో ఉంటుంది. డ్యుయల్ నానో సిమ్ కార్డ్స్ సపోర్టెడ్ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్-13 వర్షన్‌పై పని చేస్తుంది.
ఒక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ఎస్వోసీ చిప్ సెట్ విత్ మాలి జీ57 జీపీయూతో వస్తున్నది. గ్లోబల్ మార్కెట్లో 4జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్, 8 జీబీ రామ్ విత్ 256 జీబీ రామ్ విత్ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్‌గా ఆవిష్కరించారు. మైక్రో ఎస్డీ కార్డు సాయంతో రెండు టిగా బైట్ల వరకు స్టోరేజీ కెపాసిటీ పెంచుకోవచ్చు.
ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ గల ఇన్ ఫినిక్స్ నోట్ 30 5జీ ఫోన్ 108-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్, 8-మెగా పిక్సెల్ సెకండరీ సెన్సర్, అన్ స్పెసిఫైడ్ ఏఐ కెమెరా సెన్సర్ కెమెరాలు ఉంటాయి. కెమెరాలకు ఎల్ఈడీ ఫ్లాష్ ఆఫ్షన్ కూడా ఉంటుంది. వీటితోపాటు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16-మెగా పిక్సెల్ కెమెరా వస్తుంది.
5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ విత్ 45 వాట్ల వైర్డ్ చార్జింగ్ బ్యాకింగ్ సపోర్ట్ ఉంటుంది. ఇన్ఫినిక్స్ నోట్30 5జీ ఫోన్ బైపాస్ ఫాస్ట్ చార్జింగ్ సొల్యూషన్ కలిగి ఉంటుంది. 30 నిమిషాల్లో 75 శాతం చార్జింగ్ అవుతుందని ఇన్ఫినిక్స్ తెలిపింది.
సెక్యూరిటీ కోసం సౌడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఆప్షన్ కలిగి ఉంటుంది. జేబీఎల్ స్టీరియో స్పీకర్లు, యూఎస్బీ టైప్-సీ చార్జింగ్ పోర్ట్, 3.55 ఎంఎం ఆడియో జాక్, డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్‌కు ఐపీ53 రేటింగ్ వస్తుంది.