Infinix GT 20 Pro | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఇన్ఫినిక్స్ (Infinix) తన ఇన్ఫినిక్స్ జీటీ 20 ప్రో (Infinix GT 20 Pro) ఫోన్‌ను మంగళవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. సైబర్ మెచా డిజైన్‌తో మూడు రంగుల ఆప్షన్లలో వస్తున్న తాజా గేమింగ్ ఫోకస్డ్ స్మార్ట్ ఫోన్. మీడియాటెక్ డైమెన్సిటీ 8200 అల్టిమేట్ ఎస్వోసీ చిప్ సెట్, 108-మెగా పిక్సెల్స్ మెయిన్ కెమెరాతో కూడిన ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ ఉంటాయి. గేమింగ్ కోసం పిక్సెల్ వర్క్స్ ఎక్స్5 టర్బో చిప్ డెడికేట్ చేశారు.
ఇన్ఫినిక్స్ జీటీ 20 ప్రో Infinix GT 20 Pro) ఫోన్ 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వర్షన్ రూ.22,999, 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.24,999లకు లభిస్తాయి. ఈ ఫోన్ మెచా బ్లూ, మెచా ఆరెంజ్, మెచా సిల్వర్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటది. ఈ నెల 28 నుంచి ఫ్లిప్ కార్ట్ ద్వారా సేల్స్ ప్రారంభం అవుతాయి.
ఇన్ఫినిక్స్ జీటీ 20 ప్రో Infinix GT 20 Pro) ఫోన్ ఆండ్రాయిడ్ 14 బేస్డ్ ఎక్స్ఓఎస్ 14 వర్షన్ మీద పని చేస్తుంది. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటు, డీసీఐ-పీ3 కలర్ గమట్తోపాటు 6.78 అంగుళాల ఫుల్ హెచ్డీ+ (1080×2436 పిక్సెల్స్) ఎల్టీపీఎస్ అమోలెడ్ డిస్ ప్లే కలిగి ఉంటుంది. రెండేండ్లు ఆండ్రాయిడ్ అప్ డేట్, మూడేండ్ల పాటు సెక్యూరిటీ అప్ డేట్స్ అందిస్తుంది. పిక్సెల్ వర్క్స్ ఎక్స్5 టర్బో గేమింగ్ చిప్‌తో డెడికేట్ చేసిన ఇన్ఫినిక్స్ జీటీ 20 ప్రో Infinix GT 20 Pro) ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8200 అల్టిమేట్ ఎస్వోసీ చిప్ సెట్ కలిగి ఉంటుంది. 108-మెగా పిక్సెల్ శాంసంగ్ హెచ్ఎం6 సెన్సర్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్) సపోర్ట్, డ్యుయల్ 2-మెగా పిక్సెల్ సెన్సర్లు, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 32-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటాయి. రేర్ లో ఆర్జీబీ మినీ ఎల్ఈడీ ఆరే, సీ-షేప్డ్ రింగ్ తోపాటు మెచా డిజైన్ ఉంటుంది. ఎల్ఈడీ ఎనిమిది కలర్ కాంబినేషన్స్, నాలుగు లైటింగ్ ఎఫెక్ట్స్ అందిస్తుంది.
ఈ ఫోన్ ఎన్ఎఫ్సీ, ఎఫ్ఎం రేడియో, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, ఓటీజీ, బ్లూటూత్, వై-ఫై 802.11 కనెక్టివిటీ కలిగి ఉంటది. లైట్ సెన్సర్, ఈ కంపాస్, జీ-సెన్సర్, గైరో స్కోప్, ప్రాగ్జిమిటీ సెన్సర్, ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఎక్స్-యాక్సిస్ లినియర్ మోటార్ తదితర ఫీచర్లు ఉంటాయి. 45వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తోందీ ఫోన్.