IndusInd Bank | ఇండస్ ఇండ్ బ్యాంక్ డిప్యూటీ సీఈవో అరుణ్ ఖురానా తన పదవీకి రాజీనామా చేశారు. ఇటీవల బ్యాంకు అకౌటింగ్లో అవకతవకలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. బ్యాంక్ ట్రెజరీ ఫ్రంట్ ఆఫీస్ బాధ్యతలను చూసుకునేవారు. మార్చి 2025తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు రూ.1960కోట్ల నష్టాన్ని చవిచూసిన నేపథ్యంలో ఆయన పదవి నుంచి తప్పుకున్నారు. కంపెనీ ఖాతాలపై అంతర్గత డెరివేటివ్ పోర్ట్‌ఫోలియోలో అవకతవకలను గుర్తించిన నేపథ్యంలో.. ఇటీవలి దురదృష్టకర పరిణామాల దృష్ట్యా, ట్రెజరీ ఫ్రంట్ ఆఫీస్ ఫంక్షనరీ, హోల్ టైమ్ డైరెక్టర్, డిప్యూటీ సీఈఓ, బ్యాంక్ సీనియర్ మేనేజ్మెంట్లో భాగంగా తన పదవికి తక్షణమే రాజీనామా చేస్తున్నట్లు ఖురానా బ్యాంక్ బోర్డుకు పంపిన తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.
సోమవారం సాయంత్రం స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో ఇండస్ఇండ్ బ్యాంక్.. ఖురానా రాజీనామా ఏప్రిల్ 28 నుంచి అమలులోకి వస్తుందని తెలిపింది. ఖురానా తన రాజీనామా లేఖలో తనపై విశ్వాసం ఉంచి.. బ్యాంకులో తనకు బాధ్యతలు అప్పగించినందుకు బోర్డుకు ధన్యవాదాలు తెలిపారు. బ్యాంకు భవిష్యత్ బాగుండాలని ఆకాంక్షించారు. ఏప్రిల్ 15న డెరివేటివ్స్ పోర్ట్‌ఫోలియోలో అవకతవకల నేపథ్యంలో నికర విలువపై రూ.1,979 కోట్ల ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని ఇండస్ఇండ్ బ్యాంక్ మరొక ఇంటర్నల్ ఏజెన్సీ బేస్ నివేదికను వెల్లడించింది. ప్రైవేట్ రంగ రుణదాత గత నెలలో దాని డెరివేటివ్స్ పోర్ట్‌ఫోలియోలో అకౌంటింగ్ అవకతవకలు నివేదించింది. ఇది డిసెంబర్ 2024 నాటికి బ్యాంక్ నికర విలువపై దాదాపు 2.35 శాతం ప్రతికూల ప్రభావం చూపుతుందని అంచనా.