న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29: దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో.. కాన్పూర్ నుంచి ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరుల మధ్య విమాన సర్వీసులను వచ్చే నెల చివరి నుంచి ప్రారంభించబోతున్నట్లు బుధవారం ప్రకటించింది. ఇండిగో ఎయిర్స్‌లైన్స్ నెట్‌వర్క్‌లో కాన్పూర్ 71వ డెస్టినేషన్‌గా మారింది. అక్టోబర్ 31 నుంచి కాన్పూర్-ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లైట్ అందుబాటులోకి రానుండగా… అలాగే కాన్పూర్-హైదరాబాద్, కాన్పూర్-బెంగళూరు, కాన్పూర్-ముంబైలకు మాత్రం నవంబర్ 1న ప్రారంభించబోతున్నట్లు ప్రకటించింది. మరోవైపు ఢిల్లీ-భోపాల్ల మధ్య అక్టోబర్ 31 నుంచి ఇండిగో సర్వీసును ప్రారంభించబోతున్నట్లు పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా పేర్కొన్నారు.