చెన్నై, అక్టోబర్ 10: ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో ఈ నెల చివర్లో తమిళనాడులోని సేలం నుంచి పలు నూతన రూట్లకు విమాన సర్వీసులు ప్రారంభించబోతున్నది. ఈ నెల 29 నుంచి సేలం నుంచి చెన్నైకి, ఈ నెల 30 నుంచి సేలం నుంచి హైదరాబాద్, బెంగళూరు రూట్లలో విమాన సర్వీసులు ఆరంభిస్తున్నట్టు తెలిపింది.
దీంతో దేశీయంగా అందిస్తున్న 82వ రూటు ఇది కాగా, అంతర్జాతీయంగా 114 రూట్ ఇదని పేర్కొంది. సేలం నుంచి మూడు రూట్లకు విమాన సేవలు ప్రారంభించడం చాలా సంతోషంగా ఉన్నదని ఇండిగో హెడ్ వినయ్ మల్హోత్రా తెలిపారు.